జగద్ధాత్రి ||కూంబింగ్ || కూంబింగ్ ఇప్పుడు నన్ను నేనే పోల్చుకోలేక పోతున్నా ఎప్పుడూ ఇంతేనా , కాదు ఇప్పుడే ఈ మధ్యే ఒక శతాబ్దం గా , కొన్ని దశాబ్దాలుగా నన్ను నేను ఆనవాలు కట్టలేక పోతున్నా ఎందుకో మరి నేనెక్కడున్నానో కూడా చెప్పలేకపోతున్నా నవ్వుల లోకం నా చిరునామాగా ఉండేది ఒకప్పుడు ఇప్పుడు ఆ చిరునామా మాయామయి పోయింది ఎప్పటికీ చెరగనిదనుకున్నా చెరిగిపోయిన నా చిరునవ్వులా అనురాగం నా ఇంటి పేరు అన్నదే నాకు జ్ఞాపకం ఇప్పుడు అణు విస్ఫోటన భీకర శబ్దమే వినిపిస్తోంది ఎప్పటికీ పగలదని నే భ్రమించినా చెరిపేస్తూ భళ్లుమన్న నా హృదిలా మాటల కోటలు కాకున్నా నాది ప్రేమాన్వితంగా ఉన్న గూడు ఇప్పుడు బీటలు వారి ఆగ్రహావేశాల శిధిలమైపోయింది రూపూ , రేఖా , అందం , ఆత్మీయతా లేని ఒట్టి శకలాలు మాత్రమే కంటికి ఆనుతున్నాయి పదిలంగా ఉంటుందని నే నెప్పుడూ పాడుకునే నా పాటను అబద్ధం చేస్తూ చేతల్లోకి అనువదించే సహానుభూతి తప్ప ఇప్పుడు నన్ను మండిస్తోన్న ఈ ద్వేషాగ్ని కీల నేనెన్నడూ ఎరగనిది , ఎదురు చూడనిది మంచితనపు నా చిరునవ్వులు ఆప్యాయతా అలలతో నిండుగా అలరారిన నా చక్కని లోకం ఇప్పుడు ఎక్కడ ఉందో పట్టుకోలేకపోతున్నా రక్త బంధాలకు తలవంచి ప్రేమ బంధాలకు తల ఒగ్గి మర్యాదగా బ్రతికిన బ్రతుకు చిరునామా ఇప్పుడు గల్లంతయిపోయింది ఎవరి నడిగితే చెప్తారు నా చిరునామా వెక్కిరిస్తారు గానీ నా చిరునామా నేనే వెదుక్కోవాలి లోపలి జ్ఞాపకాల నుంచో బయటి పరిస్థితులనుంచో నా చుట్టూ ఉన్నవారి మాటలనుంచో ఎలాగోలా చిన్న వివరమైనా సంపాదిస్తే మళ్ళీ తిరిగి ఆ చోటుకే వెళ్లిపోదామని ఆశగా ఉంది , ఆబగా ఉంది అక్కడే రాసి పోవాలనుంది వీలైతే నా చిరునవ్వు సంతకం చేసిన వీలునామాని వీడ్కోలు పలుకుతూ అందరికీ వదిలి వెళ్లాలనుంది దిశా హీనతనుండి , అలౌకిక ఊర్ధ్వతలోకి నన్ను నేను పట్టుకునే గాలింపు చర్య ఇక మొదలైంది , ఈ క్షణమే. ..............................................జగద్ధాత్రి 3.25 పి ఏం 6/5/2014 గురువారం
by Jagaddhatri Dhaathri Jagathi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kx7yXs
Posted by Katta
by Jagaddhatri Dhaathri Jagathi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kx7yXs
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి