మా గూనపెంకల ఇంట్లోకి మల్లె తీగ జారి వుండె వేపపూల జడేసుకుని గచ్చు మురిసిపోయేది ఎతైన అరుగులమీద పిల్లలు పుంజీతం ఆడుకునేది పందిరిగుంజలమీద గుమ్మడి ఆకులతోని దొండ పిందెలు ముచ్చట పెట్టుకుంటుండె కట్టెలపొయ్యిలనుంచి లేసినపొగ అమ్మదుఃఖంలో కలిసి జమిలిగ చూరు కింద దూరేది ఆవుల గిట్టలనుంచి రాలిన వడ్ల గింజలను ఏరుకుంట కోళ్ళమంద గుంపుగ కదిలేవి కనకాంబరం చెట్టుమీద ముద్దుగుమ్మలెక్క మంచుబిందువు తలతల లాడేది జంగిటిబడికి పోవుకుంట పశువులు దొడ్లకు తోకలతోని టాటా చెప్పి బయలుదేరేవి గూళ్ళనుండి గుడిమీదకి పిట్టలు వాలి గుసగుసలు పెట్టుకునేవి మడి బట్టలతోని బాపు పణతరం మీద పక్షిలా కూర్చుండి సుందరకాండ పారాయణం చేసేది ఆకాశంలో పొద్దుగూర్ఖా సూర్యుడు నెత్తిమీదికి చేరి గరంగరంగా మందలిస్తుండె సడకుమీద పచ్చగడ్డి మోస్తున్న కూలి అవ్వల తలపులనుండి పాట వెన్నెల మెరుపై తళుక్కుమనేది కాలం చీకటి గొంగట్లకు దూరిపొయ్యేది తాటిచాపలమీద పండుకొని చుక్కలపలకమీద అక్షరకలల్ని దిద్దుకునేది ఇప్పుడు చెత్తువోసిన ఇంట్లకు కట్లపాముకేబుల్ నల్లత్రాచునెట్ వైర్లు జంటగ దిగి నిద్రల్ని మాయం చేస్తున్నవి పందిరిగుంజలిరిగి పానం పట్నం వలసపోయింది వేముగంటి మురళీకృష్ణ
by Murali Vemuganti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jUUqWc
Posted by Katta
by Murali Vemuganti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jUUqWc
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి