పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, ఫిబ్రవరి 2014, ఆదివారం

Nagendra Bhallamudi కవిత

స్నేహం కుదిరింది // 08/02/2014 అకాశానికి మనసుకి స్నేహం కుదిరింది తేలియాడే మబ్బుల్లో మనసు రాలిపడే చినుకుల్లో ఆర్తిగా ఆలపించే అమృతవర్షిణి మది ఆకాశపు అంచులను చుట్టివచ్చి ఊహలకు ఎల్లలులేవనంటోంది నింగి నేలవైపు తొంగి చూసి రాలిన చినుకుల్లో తన ప్రతిబింబం చూసుకుంటోంది ఊగుతున్న చెట్ల కొమ్మల గాలి తెరలు పారుతున్న సెలయేటి నీటితో యుగళగీతం ఆలపిస్తోంది పున్నమిని స్వాగతించిన కలువబాల మనసనే హంసవాహనంపై తారాపథం చేరుకుంటోంది నిజం అకాశానికి మనసుకి స్నేహం కుదిరింది -నాగేంద్ర

by Nagendra Bhallamudi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ggiT8l

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి