పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎
Naveen Auvusali లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Naveen Auvusali లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, ఫిబ్రవరి 2014, ఆదివారం

Naveen Auvusali కవిత

|| ఆనందం||నవీన్ అవుసలి.|| కారు మబ్బులు కమ్మిన వేలన బీటలు బారిన బీడు భూమికి ఆనందం... పుల్ల పుల్లను ఏరి గూడు కట్టిన రెక్కల కష్టాన దాగి పొదిగిన పిల్ల పక్షికి ఆనందం.. నల్లమట్టిని మలచి ఎర్రంగ కాల్చినా కుండ తీర్చు దాహం ఎండిన గొంతుకి ఆనందం.. దారి తప్పిన బ్రతుకులో దహించే బాధ నీ తోడైనా నీ దారిన ఎదురయ్యే నీ తోటి మనిషికి మాత్రం పంచు ఆనందం..

by Naveen Auvusali

from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jZbI9F

Posted by Katta

7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Naveen Auvusali కవిత

||అర్థం కాని రాక్ష(సరాజ్యం) ||నవీన్ అవుసలి|| ఏవేవో మౌన భావాలు ఎందుకో బలిసె దిగిన మూగ బాధలు .. సమరం చేసి సమాజాన్ని నిస్తేజం చేయమనా సంధి చేసి సత్తువల్ని నిస్సత్తువలు చేయమనా .. ఆత్మ రక్షణకై రాక్షసత్వాన్ని రేకెత్తించమనా అడుగంటిన అంతరాత్మని అంతమొందిన్చమనా .. కొమ్ములతో కుమ్మేసే క్రూరమృగాలని వేటాడమనా కోట్లతో కుమ్మక్కయ్యే కోడెనాగుల కోరలూడమనా.. అస్త్ర కైవసం చేసి అసురున్ని అడ్డంగా సంహరించమనా అస్త్ర సన్యాసం చేసి అసురిడికి ఆకలి నైవేద్యమవమనా .. గెలుపులేని ఓటమితోనే గెంతుతూపోమనా కుళ్ళు కుతంత్రాలు తాళలేక విగధజీవియై విశ్రాంతి తీసుకోమనా ...

by Naveen Auvusali

from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1itd0pS

Posted by Katta

6, ఫిబ్రవరి 2014, గురువారం

5, ఫిబ్రవరి 2014, బుధవారం

Naveen Auvusali కవిత

||మౌనం శూన్యం ||నవీన్ అవుసలి.|| మూగబోయిన మనసుతో ,మౌనాన్ని మోసే మదికి తనకి తన విలువేంటో తెలిపే నేస్తమే మౌనం.. శూన్యాన్ని శోధించే యోచనతో, శూన్యంతో శూన్యమైన ఆలోచనకి పదునైన ఆలోచనని పుట్టించే నేస్తమే శూన్యం... మూగబోయిన మనసుని జయించు అదే జీవితం.. శూన్యమైన ఆలోచనకి జీవం పోయు అదే అసలైన జీవితం..

by Naveen Auvusali

from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jZbI9F

Posted by Katta

4, ఫిబ్రవరి 2014, మంగళవారం

Naveen Auvusali కవిత

||నిదానం||నవీన్ అవుసలి|| ఆశయం ఆవిరవుతుందేమోననే ఆత్మఘోశ వద్దు.. ఆత్మస్ఠైర్యం సన్నగిల్లుతుందేమోననే అంతర్మథనం వద్దు.. కాలాన్ని నిర్ణయించే భూమి కూడా మెల్లిగా పరిభ్రమిస్తుంది శూన్యంలోనే... చల్లని నీడనిచ్చే పచ్చని చెట్టుకూడా మెల్లిగా మొలకేస్తుంది మట్టిలోనే...

by Naveen Auvusali

from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1elOd8r

Posted by Katta