పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, ఫిబ్రవరి 2014, ఆదివారం

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి ఈర్ష్య మా ఇంటి ముంగిట్లో కానీ పెరట్లో కానీ ఒక్క గులాబీ మొక్క కూడా నాట లేదు నేను కానీ ఎదురింట్లో పూచిన గులాబీని చూస్తే మాత్రం నాకు చెడ్డ అసూయ పాపం! తను - ఆ గులాబి తన సోయగంతో, తన సౌరభంతో మనసుల్ని అలరిస్తూ కొద్ది రోజులే జీవిస్తుంది జన్మని సార్ధకం చేసుకుని తనువు చాలిస్తుంది నేను కూడా ఏదో రోజు పోతా కానీ ఇలా క్షణక్షణం అర్ధం పరమార్ధం లేకుండా చస్తూ బ్రతకడం ఏమిటో......... బ్రతుకుతూ చావడం ఏమిటో..... నాకస్సలు అర్ధం కాదు! ఎప్పటికి మారుతుందో ఈ జీవితం? 08FEB2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f5kGLn

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి