|| శ్రీ కా రం !|| మహేశ్వరి గోల్డీ. మౌనసరస్సున ఉషాకిరణాల సమక్షంలో హంసనై జనియించి...!! ప్రేమసరస్సున స్వాతి ముత్య మాలతో నీకై నిరీక్షించి...!! కావేరి తీరమున ఓ తపస్వినిలా ప్రపంచ ప్రేమికులు ఎవరూ చదవని ప్రేమవేదాలను మౌనకావ్యాలుగా సప్తవర్ణలేఖలపై సాగరసంగమ వేళ చంద్రసుమముల సాక్షిగా....!! సుంధరహాసినినై....... సుమధురభాషిణినై......!! నీ సాన్నిహిత్యంలో నివేదించ సౌగంధికావనమున వసుంధరగా నీ అనుమతికై...!! ఆర్తితో వేచిన కాలాలు శతకోటిరాగాలాలపిస్తూ ఉషఃకాలమున హిమశంఖాలుగా సరాగాల పల్లవితో మన ఇరువురి కలయికను కాంక్షిస్తూ మౌణవీణను శృతి చేస్తున్న శ్రీపారిజాతాలు కాశ్మీర చినుకుల సవ్వడితో సిరిమల్లె పువ్వులయి మన ప్రేమకధకు అనురాగ మంత్రాలతో మధుపత్రాలపై శ్రీకారాక్షరములు రాస్తున్నవి ప్రియధరా !! 9/02/2014
by Maheswari Goldy
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kqZEOB
Posted by Katta
by Maheswari Goldy
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kqZEOB
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి