పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Vempalli Reddinagaraju లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Vempalli Reddinagaraju లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, మార్చి 2014, ఆదివారం

Vempalli Reddinagaraju కవిత

నా హృదయశిల్పం (కవిత)-కెరె జగదీష్@ రసాత్మకమైన కవితాత్మను చైతన్య పరిచే నీ చూపులు వెన్నల రాత్రుల్ని పలకరించాయి మసక మబ్బుల్లో కదలని కాలం కటిన శిలల నీడల్లో నిరీక్షణా వేదనను కళ్ళచాటున దాచుకుంది వెంబడిస్తున్న ఒక అందమైన సీతాకోక రెక్కలపై నా హృదయ శిల్పం అతుక్కుపోయింది ఆ రెక్కల కింద నీ జ్ఞాపకాల చిరుగాలి మధురమైన పరిమళాన్ని విసురుతుంది పలకరిస్తున్న ఆ తీయని క్షణాలు సప్తవర్ణ చిత్రాలై కనుపాపలతో స్నేహం చేస్తూ కన్రెప్పలకు సంకెళ్ళు వేశాయి నిరీక్షణలో బరువెక్కిన విరహవేదన జాలువార్చిన అక్షర సమూహమే నా ప్రేమగీతమయ్యింది.......... " కెరె జగదీష్@గ్మైల్.చొం//9440708133

by Vempalli Reddinagaraju

from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fVXFu9

Posted by Katta

Vempalli Reddinagaraju కవిత

//పాదాభివందనం// (కవిత)-కెరె జగదీష్ గారి '' సముద్రమంత గాయం '' కవితా సంపుటి నుండీ అమ్మ స్పర్శలొ ముంగారు వానల తొలకరిజల్లుల పరిమళం బంగారు వన్నెల కాంతికిరణాల సంతకం గోరుముద్దలు తినిపిస్తూ నా అంతరంగంలో వయోలిన్ రాగాలను వినిపించిన అమ్మ చనుబాలనందించి మానవత భాష్యానికి జీవం పోసింది జన్మజన్మాంతర బంధాన్ని గుర్థు చేసింది ఆగి ఆగి నడుస్తున్న చిన్ని చిన్ని పాదాలకు చిటికెన వేలితో చేయూతనిచ్చి నడకలు నేర్పిన అమ్మ...వొడి తొలిబడిగా కళ్ళు తెరిచింది గుండెపై చిరుపాదాల స్పర్శతో పులకరిస్తూ పలకరిస్తూ చిలకరిస్తూ పురివిప్పిన నెమలిలా అమ్మ హాయిగా నవ్వడం కళ్ళలో మెదులుతూనే వుంది అక్షరాల పక్షులతో ఆడుకోవడం నేర్పిన అమ్మ శిక్షిస్తూ రక్షిస్తూ రెండుబొట్ల కన్నీటిని కనురెప్పల చాటున దాచుకుని నిశ్శబ్ద దుఖానికి నవ్వులు అతికించడం అమ్మతనానికి నిదర్శనం మనిషితనానికి ఆదర్సం ప్రేమ తత్వంతో ఉద్వేగాన్నీ ఉత్చాహాన్నీ అమ్ర్య్త వర్షిణిలా కురిపించిన అమ్మతత్వం అనిర్వచనీయం తొమ్మిది నెలల భారాన్ని భరిస్తూ పునర్జన్మ వాకిళ్ళను తీస్తూ గాయపడి బాధపడి కన్నీటి జలపాతాన్ని గుండెలో దాచుకుని శతవసంతాల ఆనందంతో ధరిత్రిలా పులకరించిన అమ్మకు పాదాభివందనం* (-25-04-2010) )

by Vempalli Reddinagaraju

from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fVOn18

Posted by Katta

4, మార్చి 2014, మంగళవారం

Vempalli Reddinagaraju కవిత

నా మస్తిస్కంలో కవితాక్షరాలు కనుమరుగైతే జీవన శ్వాస ఆగి మరణిస్తాను" ఈ కవితా పంక్తులు నేను చదివిన కవితా సంపుటి సముద్రమంత గాయం లోనివి.కవి శ్రీ కెరె జగదీష్ గారు రాయదుర్గం అనంతపురం జిల్లా . పూర్తి వివరాలకు చరవాని 9440708133 9440708133

by Vempalli Reddinagaraju

from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jNCkbv

Posted by Katta

Vempalli Reddinagaraju కవిత

వేంపల్లి రెడ్డినాగరాజు !! మా ' స్వప్న ' o -మా ' ప్రణ ' తి !! 28-9-2013/02-02-2014/04-03-2014 ************************ మెరిపించే మేని చాయనీ ముదుతల్లేని ముఖారవిందాన్నిచ్చే సబ్బులు కాదు ఇప్పుడు మాక్కావాల్సింది మ్రుగాళ్ళ ఆకలి చూపులతో మకిల పట్టిన శరీరాల్నీ కాంక్షల కళ్ళతో మలినపడ్డ దేహాల్నీ పరిశుభ్రం చేసే సరిక్రొత్త సబ్బులు కావాలిప్పుడు అమ్మలనూ అమ్మాయిల్లా చూపుతూ అబ్బురపరిచే టెలీవిజన్ ప్రకటనల్లోలా ' స్టార్ ' లయ్యే అవకాశాలను తెచ్హే సబ్బులు కాదు ఇప్పుడు మాక్కావాల్సింది కాలేజీ ప్రాంగణాల్లో ప్రేమించమని వేధిస్తూ వెంటబడే కామ పిశాచాలు కుమ్మరించే యాసిడ్ ద్రావకం కడవలకొద్దీ మీదబడ్డా కమిలిపోక తట్టుకునేలా మా చర్మాన్ని మరింత దళసరి చేసే క్రొంగొత్త సబ్బులు కావాలిప్పుదు పట్టులాంటి మ్రుదుత్వం ముత్తుకుంటేనే కందిపోవడం లాంతి కాసులు రాల్చుకునే కాస్మో ' ట్రిక్స్ ' పడికట్టు పదాల ఊరింపు మాటలతో దేహంపై వ్యామోహం పెంచే సబ్బులు కాదు ఇప్పుడు మాక్కావాల్సింది మోహంతో..పైశాచికానుభవ దాహంతో నవ మానవ వన మ్రుగాలు విసిరే విచ్హు కత్తుల్లంటి చూపుల పిడిబాకులకు చిద్రమవుతూ కని పెంచిన వాళ్ళకి కాటి దుఖాన్ని మిగిల్చే కూతుళ్ళుగా కాక యుద్ధ రంగంలో ఘర్జించే రుద్రమల్లా మా దేహాల్ని సన్నద్దం చేసే న్యూ ప్రోడక్షన్ కోసం ఇప్పుడు మేం ' స్వప్నించే ' ది-ఎప్పుడూ ' ప్రణతి ' oచేది (వరంగల్లు స్వప్న,ప్రణతిలు గుర్తుకు వచ్చి ) వేంపల్లి రెడ్డినాగరాజు 9985612167* Like · · Promote · Share Srinivasu Gaddapati, Rama Krish

by Vempalli Reddinagaraju

from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eYDJqp

Posted by Katta

9, ఫిబ్రవరి 2014, ఆదివారం

Vempalli Reddinagaraju కవిత

వేంపల్లి రెడ్డినాగరాజు !!మట్టి వాసన !!05-10-2013//07-02-2014 ***************** మబ్బుపట్టిన ఆకాశాన్ని చూసినప్పుడు నా మనస్సు పురివిప్పిన మయూరంలా నాట్యం చేస్తుంది జలతారు తెరలు వ్రేలాడినట్లు నింగినుండీ నేలకు ధారగా కురిసే వాన చినుకులు కనిపించినప్పుడు నేను మళ్ళీ మా"పల్లె" లో గడిపిన బాల్యపు అనుభూతుల్లోకి జారుకుంటాను కల్లాకపటం తెలియని ఆరేడేళ్ళ పసితనంలో అయ్యవార్ల బెత్తం దెబ్బలు గుర్తుకొస్తున్నా లెక్క చేయక చింపిన నోటుపుస్తకం కాగితాలతో చేసిన పడవల్ని వీధుల్లో ప్రవహించే పిల్లకాలువలపై వదిలిన మధుర స్మృతులు ఇప్పటికీ నా మనోఫలకంపై చెరిగిపోని చిత్రాల్లా గోచరమవుతూనేవుంటాయ్ వానాకాలంలో చిరుజల్లులకే వురిసే మా వూరి సర్కారు బడికి లాంగ్ బెల్ సిగ్నల్ ఎప్పుడవుతుందోనని ఒళ్ళంతా కళ్ళింతలు చేసుకుని ఆత్రంగా ఎదురుచూసే నాకు గడియారంలోని సెకన్ల ముల్లు కూడా గంటలముల్లు లాగే బద్దకంగా ఒళ్ళు విరుచుకొని భారంగా కదిలినట్లనిపించేది బడి వదలగానే పొద్దుపొయిందాకా వర్షంలో తడుస్తూ జట్టుతోపాటూ పరుగులెత్తి పిల్లకాలువలకు గట్లుకట్టి తడిసి ముద్దయిపోయి చలికి వణుకుతూ ఇంటికి చేరుకునే నన్ను తిట్ల హారతితో ఆహ్వానించి,అభిమానంతో కోపగించుకుని ఆపై ఆప్యాయంగా అక్కున చేర్చుకునే అమ్మ ఒడి నాలుగు చినుకులు రాలినా నాకిప్పటికీ జ్ఞాపకానికొస్తుంది రోహిణీ కార్తె ఎండలకు నోళ్ళు తెరుచుకున్న బీళ్ళన్నీ రాలిన చినుకులతో తనువంతా తమకంతో తడుపుకుని పచ్చిక బయళ్ళుగా రూపాంతరం చెంది నన్ను ఆడుకునేందుకు రమ్మని పిలిచే ఆట స్థలాలయ్యేవి పిల్ల తెమ్మెరలకు మెల్లగా తలలూపే అరవిరిసిన అందమైన గడ్డిపూలు హరివిల్లులోని రంగులన్నీ తమ రెక్కలకు అద్దుకున్నట్లు కనిపిస్తూ హద్దు లేకుందా ఎగిరే సీతాకోక చిలుకలు పొద్దుతెలియనీయక ఆటలో అలసిపోనివ్వని నా నేస్తాలయ్యేవి తొలకరి చినుకులకు తడవగానే పులకరించే పుడమితల్లి వెదజల్లే మధురమైన"మట్టివాసనాకలిగించే మత్తు కోసం నా శరీరం గమ్మత్తుగా పలవరించేది యాంత్రికత రంగు పులుముకొని మమ్మీ-డాడీల సంస్కృతిలో పెరుగుతున్న నా పిల్లలకు నా బాల్యంలోని వర్షానుభూతుల్ని పొరలు పొరలుగా విప్పి ఎన్నిరకాలుగా వర్ణించి చెప్పినా తక్కువే ఎందుకంటే............ పాశ్చత్య నాగరికత భ్రమలో పల్లె పదానికి అర్థం మర్చిపోయిన పట్నవాసులుగా అనుభూతులకూ,అనుభవాలకూ దూరంగా బ్రతుకీడుస్టున్న వాళ్ళకు అరక్షణం తీరిక దొరికినా మక్కువగా కనిపించే కంప్యూటర్ గేంస్ అన్నింటికన్నా ఎక్కువే కాబట్టి* --వేంపల్లి రెడ్డినాగరాజు 9985612167*

by Vempalli Reddinagaraju

from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l2LgtJ

Posted by Katta

7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

6, ఫిబ్రవరి 2014, గురువారం

Vempalli Reddinagaraju కవిత

వేంపల్లి రెడ్డినాగరాజు !! బోన్సాయ్ బాల్యం!!06-10-13!!05-02-14!! ******************* అందని ఆకాశం అంచుకి నిచ్చెనలువేసి ఆశల సౌధాలను నిర్మించాలనుకునే క్రమంలో మీ కలల బ్యాగులు వాళ్ళ శక్తికి మించిన బరువులై వీపున భారంగా వేలాడే పుస్తకాల సంచీలవుతాయి కాలాన్ని క్యాలెండర్ మీద తేదీలు,వారాలుగా కాక ' కాంపిటీషన్ ' దృష్టితో మాత్రమే చూసే మీ చూపులకు అందమైన బాల్యం పాలుకారే చెక్కిళ్ళ పసితనంలోనే అయిష్టంగా అమ్మఒడిని వీడిన బుడిబుడి అడుగులై ' కార్పోరేట్ బడిలొ మడత నలగని ' యూనిఫాం ' లవుతాయి మీ భవిష్యత్ ఊహల్లో ఇంజనీర్లు,డాక్టర్లయినవాళ్ళు అమెరికా డాలర్ల పంట పండించే వృక్షాలయ్యేందుకు వేల డొనేషన్లు వసూలు చేసే ఖరీదైన స్కూళ్ళ నేలలో పెట్టుబడి విత్తనాలుగా నాటబడి తరగతి గదుల్లో సత్తువ లేని మొక్కలుగా అంకురించి తలలు వాల్చేస్తాయి పిండారబోసిన వెండివెన్నెల వెలుగుల్లో గోరుముద్దలు తింటూ నానమ్మ,తాతయ్యలుచెప్పే జానపద కథలను వింటూ ఆదమరిచి నిద్రించి కలల అలల్లో తేలియాడాల్సిన వాళ్ళను నాలుగు గోడలమధ్య క్లాస్ రూం బందిఖానాలో ఖైదుల్నిచేస్తాయి అభిమానంగా ఎత్తుకోవడాలు,ఆప్యాయంగా హత్తుకోవడాల్ని పలవరించే పసి హృదయాల కలల్ని కల్లలుచేస్తూ ర్యాంకులు తగ్గిపోతాయన్న హడావుడితో మీరుచేసే ఆరాటం ఏటినీటిలో స్వేచ్చగా తిరుగాడే చేపపిల్లలను గాజుపలకల మధ్య అందమైన అక్వేరియంలో బంధించి ఆహారంగా కృత్తిమ ఆక్సిజన్ అందించేట్లుచేస్తుంది పగలంతా పుస్తకాలపురుగులై అలసినవాళ్ళను ' హోంవర్క్ ' భూతం అర్ద్రరాత్రిదాకా వెన్నాడి ఆవులింతలకు సైతం దూరం చేస్తుంది పొరపాటున ప్రోగ్రెస్ కార్డ్ లో తగ్గిన మార్కులు మీ కళ్ళలో ఎరుపుజీరలై వాళ్ళపాలిట హుంకరింపులవుతాయి ఆట బొమ్మలతో ఆడుకోవాల్సిన వాళ్ళ లేబ్రాయపు చేతివేళ్ళు ' శిక్షణ ' పేరుతో పేముబెత్తం దెబ్బలతో బొబ్బలెక్కుతాయి వెన్నుసైతం ఒంగొపోతున్నా తప్పని టన్నులకొద్దీ పుస్తకాల మోతతో ఆరేడేళ్ళ పసివయస్సులోనే మూరెడు పొడవు పెన్సిళ్ళను చేతబట్టిన బాల్యం ఇస్త్రీ మడతనలగని ' నెక్ టై ' ల సాక్షిగా కుస్తీకి సిద్దమవుతోంది ' కంప్యూటర్ పై కళ్ళు '-' అమెరికావైపు కాళ్ళు ' గా సాగే మీ ధోరణి వాళ్ళను చిలుక పలుకులకు దూరం చేస్తోంది పలకా,బలపాలతో జతకట్టిన పసితనం తమకళ్ళను నల్లబల్లకు అతికించుకొని ఆప్యాయతకు దూరం అవుతోంది మమతల ఎరువుతో ఆప్యాయతల పాదుల్లో ఏపుగా పెరిగి కాపుకాయాల్సిన మెదళ్ళను మొదలంటా నరికివేసి పరచిన పచ్చనోట్ల తివాచీలపై మీరు పెంచే మరుగుజ్జు (బోన్సాయ్)వామన వృక్షాలు ఉగ్గుపాల దశలోనే బొగ్గుపులుసు వాయువుల్ని శ్వాశిస్తూ అందరికీ ఫలితమివ్వని కుండీ మొక్కలుగానే పెరుగుతాయి అందుకే అమ్మా నాన్నలూ ..... వాళ్ళను చదువు ' కొనే ' వాళ్ళుగా కాక ఎన్నటికీ మరచిపోలేని సుమధుర అనుభూతుల్ని మిగిల్చే బాల్యం అనుభవాల్ని మళ్ళీ,మళ్ళీ జీవితాంతం చదువుకునేవాళ్ళుగా ఎదగనీయండి ప్లీజ్........* (అంద్రజ్యొతి నవ్య వీక్ల్య్ 24-05-2006) (కవితావార్షిక-2006, మట్టి వాసన కవితా సంపుటి లో పునర్ముద్రితం) వేంపల్లి రెడ్డినాగరాజు 9985612167* (నేను స్వప్నించే లోకంలో జీవించే వారి కోసం)

by Vempalli Reddinagaraju

from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nT6TPt

Posted by Katta

4, ఫిబ్రవరి 2014, మంగళవారం

Vempalli Reddinagaraju కవిత

చీకటి స్వర్గం-వెలుతురు నరకం//27-9-2013//04-02-2014// ******************************* కోర్కెల కొలిమలా కాగే నరాల వెచ్చదనాన్ని చల్లబరుచుకునేందుకు నీ నగ్న దేహపు దుప్పటిని నాపై కప్పి తమకంతో తనువంతా పులకింపజేసి మరుజన్మకైనా మరచిపోలేనివిధంగా రాత్రి బెడ్ రూంలో "చీకటి"స్వర్గంచూపించావు. నువ్వుచేసిన చిలిపి పనుల తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కూరలో కాస్తంత కారం ఎక్కువ జేస్తే ఎవడి తలపుల్లో తరిస్తూ వంట పాడు చేసావేఅంటూ పగలు డైనింగ్ హాల్లో నా చెంప చెళ్ళుమనిపించి "వెలుతురు"నరకం స్రుష్టించావు బెడ్రూంలో చూపిన చీకటి" స్వర్గానికీ" డైనింగ్ హల్ల్లో స్రుష్టించిన వెలుతురు"నరకానికీ" తేడా రాత్రి నీ"అవసరపు"చేతలదా"? పగటి"పురుషాహంకారపు" చేతులదా"? ------వేంపల్లి రెడ్డినాగరాజు*--9985612167

by Vempalli Reddinagaraju

from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1inQKOE

Posted by Katta

Vempalli Reddinagaraju కవిత

వేంపల్లి రెడ్డినాగరాజు !! మా ' స్వప్న ' o -మా ' ప్రణ ' తి !! 28-9-2013/02-02-2014 ************************ మెరిపించే మేని చాయనీ ముదుతల్లేని ముఖారవిందాన్నిచ్చే సబ్బులు కాదు ఇప్పుడు మాక్కావాల్సింది మ్రుగాళ్ళ ఆకలి చూపులతో మకిల పట్టిన శరీరాల్నీ కాంక్షల కళ్ళతో మలినపడ్డ దేహాల్నీ పరిశుభ్రం చేసే సరిక్రొత్త సబ్బులు కావాలిప్పుడు అమ్మలనూ అమ్మాయిల్లా చూపుతూ అబ్బురపరిచే టెలీవిజన్ ప్రకటనల్లోలా ' స్టార్ ' లయ్యే అవకాశాలను తెచ్హే సబ్బులు కాదు ఇప్పుడు మాక్కావాల్సింది కాలేజీ ప్రాంగణాల్లో ప్రేమించమని వేధిస్తూ వెంటబడే కామ పిశాచాలు కుమ్మరించే యాసిడ్ ద్రావకం కడవలకొద్దీ మీదబడ్డా కమిలిపోక తట్టుకునేలా మా చర్మాన్ని మరింత దళసరి చేసే క్రొంగొత్త సబ్బులు కావాలిప్పుదు పట్టులాంటి మ్రుదుత్వం ముత్తుకుంటేనే కందిపోవడం లాంతి కాసులు రాల్చుకునే కాస్మో ' ట్రిక్స్ ' పడికట్టు పదాల ఊరింపు మాటలతో దేహంపై వ్యామోహం పెంచే సబ్బులు కాదు ఇప్పుడు మాక్కావాల్సింది మోహంతో..పైశాచికానుభవ దాహంతో నవ మానవ వన మ్రుగాలు విసిరే విచ్హు కత్తుల్లంటి చూపుల పిడిబాకులకు చిద్రమవుతూ కని పెంచిన వాళ్ళకి కాటి దుఖాన్ని మిగిల్చే కూతుళ్ళుగా కాక యుద్ధ రంగంలో ఘర్జించే రుద్రమల్లా మా దేహాల్ని సన్నద్దం చేసే న్యూ ప్రోడక్షన్ కోసం ఇప్పుడు మేం ' స్వప్నించే ' ది-ఎప్పుడూ ' ప్రణతి ' oచేది (వరంగల్లు స్వప్న,ప్రణతిలు గుర్తుకు వచ్చి ) వేంపల్లి రెడ్డినాగరాజు 9985612167*

by Vempalli Reddinagaraju

from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kB49Un

Posted by Katta

3, ఫిబ్రవరి 2014, సోమవారం