పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, ఫిబ్రవరి 2014, ఆదివారం

Thilak Bommaraju కవిత

తిలక్/అ"సంఘర్షణ ---------------------------- నాలో నేను కాలిపోతున్నప్పుడు ఆ వెలుగులో మనోదివిటి వెక్కిరిస్తుంటే మబ్బుల గుండా సెగల రెక్కలేవొ నన్ను దులుపుతుంటే ఆర్డ్రతను చేతి కొసల చివరన చూపెడుతూ రంగులతో కలిపిన కాస్త మట్టిని దేహపు సొరంగాలలో పులుముకుంటూ నా అడుగుల కింద పడి బిక్కుబిక్కుమంటు గాలి పట్టాలు చెక్కని శిలాస్పటికంలా సంభాషణల గోటి మొదళ్ళు ఇంక చాల్లే చల్లార్చుకొందాం ఆర్బాటాల గుహలలో మగ్గిన విగత కళేభరాల్ని కొత్తగా మొదలెడదాం అనుకుంటూ పోగేసుకున్న ఎండుగుడ్ల కార్ఖానా చివరి మజిలి బాగుండాలని శృంకల శకలాలను పచ్చిగా పేర్చుకుంటున్నా నిగూడ వరండాలలో నన్ను నేను తడుపుకుంటూ తిలక్ బొమ్మరాజు 09.02.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bgeDID

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి