పారువెల్ల || పదే పదే నువ్వు అదే అంటావు పువ్వుకు ఓ రంగును పులిమేవాడు ఎగిరే పతంగి దారం తెంపేవాడు నీలోనే ఉన్నాడు అయినా పదే పదే నువ్వు అదే అంటావు కట్టిన బట్టతో పెట్టిన బొట్టుతో మనిషిని కొలిచేవాడు నీలోనే ఉన్నాడు అయినా పదే పదే నువ్వు అదే అంటావు గాయపడని దేహాలేవీ లేవు మందుకోసం వెళ్లి మైకంలో పడ్డావు ఏ మందు తాగావో పువ్వులూ నీవే ఎగిరే పావురాలు నీవే ఏ రెక్కలు తుంచినా ఆ చేతులు నీవే 09.02.2014
by Srinivas Reddy Paaruvella
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d80ADJ
Posted by Katta
by Srinivas Reddy Paaruvella
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d80ADJ
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి