పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, ఫిబ్రవరి 2014, ఆదివారం

Kapila Ramkumar కవిత

Karlapalem Hanumantha Rao's లింక్ సరదా కవితే కాని.. కవి కుమారు లందరూ తప్పక చదవి తీరాల్సిన కవిత నేనెవ్వరంటావా? నువ్వు శ్లేషాలంకారానివో, ఉపమాలంకారానివో నాకు తెలీదు. మైలున్నర సమాసాని వైనా మహగొప్ప సంధి వవయినా నాకు ఖాతర్లేదు. చేవ లేనిదానివో చైతన్య స్రవంతివో నాకెందుకు? ద్రాక్షాపాకాని వయితే దయ చూపించేది లేదు. నారికేళపాక మయితే దాసోహ మనేది లేదు. మేలిమి వచనవయితే మరలి పోయేది లేదు. తేలిక వచనమయితే కాల రాచేది లేదు, నిన్ను ఆపడం నాధ్యేయం. నీ వెవరవయితేనేం? నీ లిమిటేషన్సు నీక్కనబరచడం నా బతుకు. కాలానికి కళ్ళున్నాయని చెప్పడం నా విధి. నా కళ్లముందు పడకముందే అనుభవించాల్సిందంతా అనుభవించు. మత్తేభంలా నడుస్తావో, శార్దూలంలా ఘీంకరిస్తావో ఘీంకరించు. మందార దామంగా విరుస్తావో, చంపకంగా పూస్తావో పూయి. ముత్యాలసరంగా మెరుస్తావో, మత్తకోకిలగా కూస్తావో కూయి. వచనంగా వందపేజీల్దాకా కామాలతో కాళ్లరిగేలా తిరుగు. సెమికోలన్లతో, డాష్ మార్కులతో నీ ఇచ్చవచ్చినట్లు బతుకు. ఇన్ని అయ్యాకా ఇంకా రానంటావూ? చీకటి పడలేదంటావూ? తమ్ముడూ, నా చేతిలో అధికారం లేదు. ఇంకా తిరిగితే అర్థం అయోమయం అవుతుంది. భావాలు కుత్తుకలు కరుచుకుంటాయి. పుస్తకం ఉక్కిరి బిక్కిరవుతుంది. క్రొత్తపుస్తకం మొద లెట్టా ల్సొస్తుంది. అందుకే ఇలా రా! నిన్ను గర్భంలో దాచుకుంటాను. నిన్ను చదివేసి పాదాల్లో వది లేస్తాను. మరలేసిన పేజీల్లో చెఱ వేస్తాను. మంచి భావాని వయితే నీ జ్ఞాపకాన్ని ముందు పేజీల్లో మననిస్తాను! నేనెవ్వరంటావా? నీకు తెలీదూ? నేను ఫుల్ స్టాప్ ని, గమనానికి ప్రస్తావనని. గమనానికి పరిసమాప్తిని. -శ్రీ వి.ప్రేమ్ చంద్ కిషన్ రావు ('65ల నాటి భారతుల నుంచి నేను సేకరించి ఉంచుకున్న మంచి కవితల నుంచి) 9-02-2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eJYl9F

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి