ఒక మొగుడి గారి మోనోలాగ్::: వాడిపోయిన శతపత్రం లాగో మాసిపోయిన ముఖచిత్రం లాగో నిన్ను చూస్తే సఖీ ! భయమేస్తున్నది. నా మీద నాకే జాలేస్తున్నది. **************************************** ఆమె ఆలోచనల్లా గిరున తిరుగుతున్న పంకా రెక్కలు మంచం మీద అస్తవ్యస్తంగా పడున్న ఆశల ముక్కలు చిమ్మగా మెరుస్తున్న చిచ్చర కళ్ళు అవి అంగారకునికి అచ్చంగా నకళ్ళు. ఆపుకోలేని ఆమె అధర కంపనానికే అవును,అందుకే,భూమి గిర్రున తిరుగుతున్నది. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసల్నే అలలుగా కడలి అరువుగొన్నది. ఆమె కప్పిన ముసుగు నేర్పిందేమో బహుశా చీకటి కింత నల్లదనపు నిర్దయను. ఆమె పక్క విరుపుల్లోంచి ఒడిసిపట్టుకుందేమో గడియారం కదిలే మెలకువలను ఆమె మౌనమే తన పేరుతో పిడుగులకు శబ్దాలను చెక్కిందేమో ఆమె మౌనమే కావచ్చు చుక్కలకు చూపు రక్తమై ఎక్కిందేమో ****************************************** పెళ్ళగిలి పడుతున్న దూరం ఉనికిని కోల్పోతున్న భారం ఎందుకంటే ఏం చెప్పను-ఏమో ఈ మధ్య ఏనాడు తీరుబడిగా ఆమె ముఖాన్ని చదివాను ఒక ముఖపుస్తకాన్ని తప్ప ************************************************* వెలసిపోయిన పాలపుంతలాగో ఒలికి పోయిన పాలముంతలాగో నిన్ను చూస్తే సఖీ !జాలేస్తున్నది నేనంటే నాకే భయమేస్తున్నది. 09-02-2014,మంచిర్యాల్.
by Patwardhan Mv
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fNs0Np
Posted by Katta
by Patwardhan Mv
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fNs0Np
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి