॥ ప్రేమగ్రంథం ॥ నాకు తెలుసు నేనంటే నీకిష్టమని నీకు తెలుసు నీవే నా దైవమని. నా ప్రేమ చందమామ నీవే అని నీ ముద్దు చిలుకమ్మ నేనే అని. నేను అనునిత్యం ఆరాధించేది నిన్నే అని నీవు అనుక్షణం అభిమానించేది నన్నే అని. నా ప్రేమసాగరంలోని ప్రతి బిందువూ నివే అని. నీవు శ్వాసించే గాలిలోని పరిమళమన్తా నేనే అని. నా అనుగాలపు కతృ కర్మ క్రియలన్నీ నీవే అని. నీ రచనలోని ప్రతి స్పందనా నేనే అని. నీకు తెలుసా ?? ప్రియా... మన ప్రణయమే మహాకావ్యమని ఆ కావ్యమే ఒక గ్రంథమని అందులోని వాక్యములే ఈ కవిత అని. ॥మాలచిదానంద్॥9-2-2014||
by Mala Chidanand
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gYyz4Y
Posted by Katta
by Mala Chidanand
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gYyz4Y
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి