పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, ఫిబ్రవరి 2014, ఆదివారం

Jaya Reddy Boda కవిత

//జయ రెడ్డి బోడ // తడి ఆరని జ్ఞ్నాపకం // చిరకాల ఎదిరి చూపుల అనంతరం కురిసే తొలకరి జల్లులకు పులకరించే భూమి పుత్రుడుగా దిగుతాను నేను .. సానుకూలంగా స్పందించి పచ్చగా విచ్చుకొని ఆహ్వానించే ప్రకృతి కాంతలా, చేతులు చాచి నువ్వు .. దూరానికి దూరానికి మధ్య జరిగే సమాగమమే అయినా అదే మన తొలి సంగమం లా, ఆ రసాస్వాదనా ..ఆనంద సాగరంలో మునిగి తేలి, అటు తిరిగి నువ్వు ఇటు తిరిగి నేను మత్తుగా గమ్మత్తుగా లతల్లా పెనవేసుకొని ఒకరికొకరం ... యుగాల కదలికల్లో అడుగడుగునా కలిసిన భావనలో .... నేను, క్షణికమైన ఆ మురిపెము మత్తుకు లాలసుడనై అచేతనవస్తలోకి వెళ్లి పోయనేమోనని అనుకున్న, నువ్వేమో.... కల లాంటి మన కలయిక, కదలకుండా ఉండదు కదా అన్న నీ భయావహ యోచన లో.. పైకప్పు వైపు.. నిస్తేజంగా, కేవలం ఓ పసుపు తాడుతో నిన్ను ఒంటరి 'బందీని'చేసి, కటిన హృదయుడిగా వదిలి వెళ్ళిన మాట వాస్తవమే అయినా.. "పిచ్చి పిల్లా " నేను "వీధి" ఆడిన వింత నాటకంలో విదూషకుడనై దిగువ మధ్య తరగతుల హెచ్చు తగ్గు లలో నలిగి పై కొమ్మకెగుర భంగపడి.. నేల విడచి సాము జేసి, ప్రవాసమనే వ్యసనంలో... చిక్కుకు పోయిన అమాయకున్నే కానీ, ఏ ప్రేమ భావం లేని ...శిల' నై కేవలం కాముకున్నైన ఓ కొయ్యను మాత్రం కాను లే, వేకువ జామున, అలుపెరుగని నీ నాజూకైన చేతి ముని వేళ్ళతో నా పాదాలను తెలిసి తెలియకుండా.. తగిలి తగలనట్టు స్పృశించి, నువ్వు వెళ్లి పోయాక..... నేను తడిమి చూడలేదనుకున్నావా ?.. దిండుపై రాత్రి, నీ కన్నులు వర్షించిన.. వేడి నీటి దారల తడిని... నువ్వు భాద్యతల బరువుల్లో 'క్షమయా ధరిత్రి' వై, మరిచావేమో కానీ, అది నా మదికిప్పడికీ ఎప్పటికీ ఒక తడి ఆరని జ్ఞ్యాపకమే..! (09-02-2014- తెలిసీ తెలియని తనంలో మన "కలయిక" 25 వసంతాల ఈ జ్ఞ్యాపిక నీకు ...నాకు)

by Jaya Reddy Boda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MB01HT

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి