పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, మే 2014, గురువారం

Sriarunam Rao కవిత

హర్డ్ వర్క్ :- మనం సాధించాలనుకున్న దానిని ఒకేఒక మాటలో చెపారు మన పెద్దలు, `అదే కష్టే ఫలి` అంటూ. మీ సాధన ఎంత నిజమైతే.. అంతగా ఈ మాటని నమ్మండి. కష్టాన్ని మించిన ఫలితం మరొకటి వుండదు. అయితే చాలా మంది నుండి ఈ మాటపై కొన్ని సందేహాలను నేను ఎదుర్కొనటమూ జరిగింది కూడా. "ఎంత కష్టపడినా సరైన ఫలితం రావటం లేదు. మరేవో ఫలితాన్ని శాసిస్తున్నట్లుంది. మాకు మాత్రం ఎప్పుడు ఈ కూలీ బ్రతుకే మిగులుతుంది" అంటూ పెదవి విరిచేవారు నాతో చాలామందే వున్నారు. వీరి విరుపులు ఎలా వుంటాయంటే.. ఒక్కొక్కసారి మనలో కూడా ఇది నిజమేనేమో అన్న మీమాంస మొదలవటం జరగవచ్చు. నిజానికి వీరి మనస్తత్వం ఎలా వుంటుందంటే తమకంటే ముందుగా వెళ్ళిపోతున్న వారంతా `ఏదో` అదృష్టం కలిసొచ్చినందువల్లనే అలా సాధించుకొని వెళ్ళిపోతున్నారు అన్నట్లుంటుంది. ఇదంతా నిజమేనా? అలోచించండి, మీరు పడుతున్న కష్టం వెనుకనున్న నేపధ్యం ఏమిటి? దాని ఫలితాన్ని మీరు రీసైక్లింగ్ చేసుకుంటున్న విధానం ఏమిటి? ఈ రెండింటిపై ఒక విశ్లేషణ చేసుకోవాల్సిన సమయం ఇప్పుడే. ప్రతీ కష్టమూ ఫలితాన్నిస్తుంది.. ఏదో ఒక రూపంలో. కాకుంటే ఆ ఫలితాన్ని వినియోగించుకోవటానికి మనం చేసుకునే విశ్లేషణే మన విజయాన్ని మనం అందుకునే మార్గం. from my book "anthar bhramanam" “శ్రీఅరుణం” 9885779207

by Sriarunam Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lD88kt

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి