పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, మే 2014, గురువారం

Aravinda Raidu Devineni కవిత

అరవిందరాయుడు//మెట్టు-4//06 -------------------------------మెట్టును చూస్తుంటే అనంతశిష్యకోటిని ఉన్నతలక్ష్యాలకుచేర్చి తానుమాత్రం ఉన్నచోటున్నే నిలిచిపోయే గురువుగుర్తుకొస్తున్నాడు పార్టీజండాను-నాయకునిపదవినీ తనప్రాణప్రదంగా మోస్తోన్న ఓ సామాన్యకార్యకర్తనూ మెట్టుబింబిస్తోంది ఓమహా వంశ యశ్శస్సునూ ఓమహాయుద్ధభారాన్నీ తనభజస్కంథాలపైదాల్చిన భీష్మాచార్యుడూ, ' "అతిథిదేవోభవ"అంటూ వామనుని మూడోపాదానికి తనశిరస్సును అర్పించిన బలిచక్రవర్తీ సాక్షాత్కరిస్తున్నారు డాబుసరికీదర్పానికీ ప్రతీకయై సోమరుల మరులుదోచే లిఫ్ట్్ లప్రభావంతో తనప్రాధాన్యతపిసరంత తగ్గినట్లనిపింంచినా మెట్టునాశ్రయించేవారూ అసంఖ్యాకులే శిశువు రూపంలో ఆసుపత్రిమెట్టుతో ఇహంలోకి రావడంతో మొదలైన మానవజీవనప్రస్థానం అంతిమఘడియల్లోనిరోగిరూపంలో అదే మెట్టు ఆత్మీయస్పరశతో పరంలోకి చేరేదాకా మెట్టులేని మనుగడ ఊహించడమూ కష్టమే 15-5-2014

by Aravinda Raidu Devineni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lt9b3E

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి