ఒక్కోసారంతే... దేహం నీరసపడ్డప్పుడే మనసు రెక్కలు తొడుక్కుంటుంది. కళ్ళు కలల్ని కసిరేసినప్పుడే కొత్తలోకం కరచాలనమడుగుతుంది. ఆశలు ఆవిరుతున్నపుడే ఎండమావుల కవాతు మొదలౌతుంది. * * * ఎందుకనో.... పదునైన కోర్కెలను సానపట్టే ఈ హృదయానికి దయే ఉండదు. నిర్దాక్షిణ్యంగా తనను తానే గాయపరచుకుంటుంది. ఉదయసంధ్యలూ ఏదో ఒక అలజడిని సాలేగూల్ళలా మస్తిష్కంలో అలికిడి లేకుండా అల్లేస్తుంది. అమాయకంగా అల్లిన గూడులోనే చిక్కుకుపోతుంది. * * * అయినా ... రగిలే కాంక్షని త్యజించాలనుకునే మనిషిలో యుగాలుగా మార్పే లేదు !! కాలం మిగిల్చిన కన్నీటి చారికలను మాన్పే లేపనమే లేదు !! 15-05-2014
by విష్వక్సేనుడు వినోద్
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lzN0eZ
Posted by Katta
by విష్వక్సేనుడు వినోద్
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lzN0eZ
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి