పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Amma Akhil లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Amma Akhil లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, జూన్ 2014, ఆదివారం

Amma Akhil కవిత

!! నిజాలు !! నిజాలు మాట్లాడితే వినడం కష్టం ఎందుకంటే మన చెవులలో విషం పోసినట్లుగా ఉంటుంది కనుక... నిజాలను పట్టుకోవడం చాలా కష్టం ఎందుకంటే అవి నిప్పులలాంటివి మన చేతులు కాలుతాయి కనుక ... నిజాలను మనం దగ్గరగా చూడడం మరీ కష్టం ఎందుకంటే అవి అగ్ని పర్వతపు లావా సెగల కంటే భయంకరంగా మండుతాయి కనుక... నిజాలతో పాటు బ్రతకడం ఇంకా కష్టం ఎందుకంటే అబద్దపు బ్రతుకు అందరికీ వ్యసనమైంది కనుక... అమ్మ అఖిల్ !! 08jun14.

by Amma Akhil

from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k83iYE

Posted by Katta

15, మే 2014, గురువారం

Amma Akhil కవిత

#అమ్మఅఖిల్ //నేను వెతుకుతున్నాను// మనీ కాకుండా మనుషులు శాసించే మానవ సంబంధాలను జీవితపు చివరి దశలో కడుపార తిని కనులారా నిద్రపోయే తల్లిదండ్రులను ఈ విద్యా విధానాలతో విసుగులేకుండా చదివే పిల్లలను ఉపయోగపడే విషయాల కోసం అధిక సమయం కేటాయించే యువతను విష సంస్కృతుల మోజులో పడకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే వాళ్ళను పదవి వ్యామోహం కాకుండా ప్రజాసంక్షేమం కోసం పాటుపడే నాయకులను ప్రపంచ దేశాలకు దీటుగా పనికి వచ్చే సినిమాలను తీసి ఆస్కార్ అవార్డ్ తెచ్చిపెట్టే డైరెక్టర్లను అన్ని క్రీడల్లోను గోల్డ్ మెడల్ సంపాదించే క్రీడాకారులను సమాజానికి కావాల్సిన కవిత్వాన్ని అందిస్తూ నిద్రపోతున్న దేశాన్ని లాగి కొట్టి లేపేలా రచనలు చేసే కవులను కవయిత్రులను భావి భారతానికి కావాల్సిన విధంగా పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులను ప్రశాంతమైన జీవితాన్ని గడిపే అటువంటి కొంతమంది వ్యక్తులను నేను ఇప్పటికీ వెతుకుతున్నాను...! 15may14

by Amma Akhil

from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iNJ5ql

Posted by Katta

2, మే 2014, శుక్రవారం

Amma Akhil కవిత

నిప్పులాంటి నిజం #అమ్మఅఖిల్ ఇక్కడ మనుషులు మనుషులుగా కాక Machinesలాగా బ్రతుకుతున్నారు ఇక జాలి,దయ,కరుణ ఎక్కడి నుండి వస్తాయి మానవ జీవనానికి మానవత్వమనే సహజ లక్షణం ఉంటుంది బ్రతుకంతా యాంత్రికజీవనమైపోయాక మానవత్వమనే గుణం మచ్చుకైనా ఎక్కడ కనపడుతుంది యంత్రాలతో ప్రేమలో పడి ఈ మనుషులు కూడా మనసులేని మరమనుషులుగా మారుతుంటే నెత్తి నోరు కొట్టుకోవడం తప్ప చేసేదేమి లేదు కొన్ని గ్లిజరిన్ కన్నీళ్ళు కార్చడం తప్ప...! ఈ కన్నులతో ఇంకెన్నో మారణకాండలు, మరెన్నో మానభంగాలు ఇంకా కొన్ని నరహత్యలు చూడాల్సిందే... ఇలాంటి దారుణ సంఘటనల నడుమ కొందరు ఎదురుతిరిగితే అధికారబలంతో అణగద్రొక్కే వారేందరో... ఓ భరతమాత నీ కన్నీళ్ళకి కరిగే లోకులు ఏనాడో చచ్చిపోయారు నువ్వు గుండెలు పగిలేలా రోదించినా పట్టించుకునే పాపాన పోయిన నాథులు లేరు మనసారా కోరుకుంటున్న ఇకనైన నీ శోకానికి తెరపడాలని ప్లాస్టిక్ నవ్వులు కాకుండా నీ పెదాలపై నిండైన చిరునవ్వులు పూయాలని... 02may14

by Amma Akhil

from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mjWb6I

Posted by Katta

14, ఏప్రిల్ 2014, సోమవారం

Amma Akhil కవిత

పిచ్చి ప్రయత్నాలు చేయకు #అమ్మఅఖిల్ ఎక్కడున్నావు ప్రియతమా...? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? నీకు నేను గుర్తున్నానా నీతో కలిసి ఏడడుగులు నడవాలనుకున్న నీ ప్రేమికుడిని ఈ చావు బ్రతుకుల సంగమంలో నాతో ఆఖరి మజిలి వరకు వస్తానని నువ్వు చేసిన ప్రమాణాలు అప్పుడే మర్చిపోయావా? ఏది ఏమైనా నీతోనే ఈ జీవితం కొనసాగాలని ఆశపడుతున్నానని ఆనాడూ నువ్వు చెప్పిన మాటలు ఈనాడూ ఊపిరి లేనివైపోయాయా? నాతో నువ్వు ఎంతో ప్రేమగా చేసిన బాసలన్నీ కాలగర్భంలో కలిసి కొట్టుమిట్టాడుతున్నాయా? ఒకరికి ఒకరం అని అందంగా మనం రాసుకున్న ప్రేమ కవితలు ఇప్పుడు చిరునామా కోసం వెతుకుతున్నాయా? నేను విన్న మాటలన్నీ నిజానిజాల ఆన్వేషణలో ఎటూ నిర్ధారించుకోలేక పోతున్నాయా? నాతో ముడిపడిన నీ ప్రేమబంధాన్ని బలవంతంగా తెంచుకోవాలని చూస్తున్నావా? మనసునిండా నింపుకున్న నీ ప్రేమను కాలసర్పం కాటు వేస్తే తట్టుకోలేక విలవిలలాడుతున్నావా? నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో ఒక్కసారి నా నుండి నీ మనసుని తీసుకెళ్ళగలవా? నా ప్రాణసఖి ఏదో ఒకరోజు చావాల్సిందే అని ఈ రోజే చనిపోతామా? ఉజ్వలమైన భవిష్యత్ ఉన్న మన ప్రేమకు ఉరితాడు బిగించాలని చూస్తున్నావా? హృదయాంతరాళం నిండా నిండిన ప్రేమకి సమాధి కట్టాలని అనుకుంటున్నావా? కలిసిన మనసులను విడదీయాలని "పిచ్చి ప్రయత్నాలు" చేస్తున్నావా...? నీకిది న్యాయం నా ప్రాణమా... ఎలా ఉంటుందో తెలియని రేపటి కోసం ఈ రోజు నువ్వు బాధ పడుతూ నన్ను బాధపెడుతున్నావా? ఇప్పటికైనా తెలుసుకో... నీ మీద నాకున్న ప్రేమకి మరణం లేదని సాక్షాత్తు ఆ భగవంతుడే వచ్చినా నా నుండి నిన్ను దూరం చేయలేడని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు నువ్వు ఎన్ని చేసినా నేను నిన్ను మర్చిపోలేనని ఎన్ని ఆటంకాలెదురైనా నీ చేయి విడువనని నిన్ను ప్రాణంకంటే మిన్నగా ప్రేమిస్తున్నానని...! 14apr14

by Amma Akhil

from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hB00k6

from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kQy7b1

Posted by Katta

Amma Akhil కవిత

మా అమ్మ గారు భారతీ కాట్రగడ్డ(భారతీరాయన్న) రాసిన కవితా సంపుటి "కనుల కొలను" పుస్తకం నిన్న రయ్యన్ ఫంక్షన్ హాల్,బోధన్,నిజామాబాద్ లో ఘనంగా ఆవిష్కరించడం జరిగింది.మీరు ఇలాంటి రచనలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ.

by Amma Akhil

from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p1Xt7z

Posted by Katta

17, మార్చి 2014, సోమవారం

Amma Akhil కవిత

మృత్యువు Vs ప్రేమ #అమ్మఅఖిల్ 1.మృత్యువు వేయిపడగల నాగులా మారి కోరలు చాచి మరీ కసితో ఉన్నది కాటు వేయాలని నా దేహంలో ఐక్యమవ్వాలని విశ్వప్రయత్నం చేస్తుంది నన్ను చేరుకోవాలని! 2.చాలా తాపత్రయ పడుతుంది ఉరిత్రాడులా మారాలని నన్ను గట్టిగా కౌగిలించుకోవాలని! 3.విషంలా మారి నా గొంతును ముద్దాడుతూ తనువులోకి ప్రవేశించాలని నా ప్రతి అణువులో నిండాలని చాలా తహతహలాడుతుంది పాపం గెలవాలని..! అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నది మృత్యువు చేసిన ప్రతి ప్రయత్నంలోనూ విఫలమవుతూనే ఉన్నది పాపం పిచ్చిది..! దానికి తెలియని విషయం ఏమిటంటే.?? 1.నీ తోడు నాకు ఉన్నంతకాలం అది నన్ను సమీపించలేదని నా నరనరాల్లో అది ప్రసరించలేదని! 2.నీ ప్రేమనే రక్షకకవచం నాకు అండగా ఉన్నప్పుడూ నన్ను ఆళింగనం చేసుకోలెదని ఈ గొంతులో ప్రాణాన్ని దోచుకొళ్ళలేదని! 3.నువ్వు నాతో ఉంటే అది నన్ను కనీసం త్రాకలేదని నా అణువణువునా చొచ్చుకొనిపోలేదని!! మర్చిపోయింది ఆ మృత్యువు నా ప్రాణం పోవాలంటే నేను నిన్ను మర్చిపోవాలని... తెలియదు ఆ మృత్యువుకి ఈ శ్వాస ఆగాలంటే నీ మీద నాకున్న ప్రేమ శాశ్వతంగా చావాలని.. మరణానికి కూడా మన ప్రేమ చరమగీతం పాడగలదని!!! $17mar14$

by Amma Akhil

from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p2huFF

Posted by Katta

1, ఫిబ్రవరి 2014, శనివారం

Amma Akhil కవిత

అమ్మ అఖిల్!!నా ప్రేమ!! జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు! అలానే నువ్వు కూడా నా జీవితంలోకి వస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు! కారణాలు ఏమైనా కావొచ్చు కానీ నిన్ను ప్రేమించాను,ప్రేమిస్తూనే ఉంటాను అది ఎప్పుడూ మారదు! కన్నీళ్ళు నాకు అందరికంటే ఎక్కువ ప్రియనేస్తాలు అనుకుంటా అందుకే అవి నా నుండి ఎప్పుడు దూరం కావు! ఈ రోజు ఒక రకంగా రేపు ఒక రకంగా నేను ఉండను,ఉండలేను ఎందుకంటే నా ప్రేమ శాశ్వతమైంది! నీ ప్రేమతోడుంటే నేను ఏమైనా సాధించగలను ఈ జీవితంలో... నన్ను ఒంటరిని చేసి ఎప్పుడు వెళ్ళకు ఈ జన్మలో... నాకు నువ్వు ఒక ప్రేమికురాలివే కావొచ్చు కానీ నా జీవితానికి ఒక మార్గదర్షకం ఉంది నీ ప్రేమలో... జీవనది ప్రవహించకుండా చనిపోవచ్చు గాలి వీయకుండా మూగబోవచ్చు ఆకాశం స్థిరంగా కూర్చోకపోవచ్చు మంచుకి మురికి అంటుకోవొచ్చు నిప్పు త్రుప్పు పట్టొచ్చు కాని నా ప్రేమ చావులేనిది, మూగబోనిది, స్థిరమైనది! నా ప్రేమ మలినం అంటుకోనిది, త్రుప్పు పట్టనిది! గతమెంత నన్ను బాధ పెట్టినా వర్తమానంలో ఎంత విరహంతో ఉన్నా భవిష్యత్ లో నీ బాహుబంధాల్లోకి చేరుకుంటాను! నీ ప్రేమతో,నీ ప్రేమలో మరణం లేని వాడిగా జీవిస్తాను నా ప్రాణమా...!! >01FEB14\u003C

by Amma Akhil

from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cF8Omn

Posted by Katta