పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, మే 2014, గురువారం

Surya Prakash Sharma Perepa కవిత

కనులకు కనులు... \\వేదాధ్యయ\\ \\15-05-2014\\ కన్నులకు కనులు వచ్చాయి కమ్మని నిదుర దరి చేరగనే చిక్కటి నల్లటి దీపపు వెలుగులో వెచ్చవెచ్చని వేసవి వెన్నెల చల్లని తెల్లటి సూర్యుని దూది దారాలపై నన్ను లాలనగా తోసుకుపోతోంది మనసు హిమఖండంలాంటి కాంతిపుంజం వైపు మోహం నిశాకమలమై విరుస్తోంది ఆవిరి పిల్ల మబ్బు అల్లరిగా చెక్కిలి గీటిపోయింది నిదుర సముద్రం చీకటి వేడికి మేఘమై కలల వర్షమై కురుస్తోంది ఆ స్వప్న బిందువుల దారులలో మల్లె మొగ్గలై పరుగెడుతున్నాయి తెల్లటి దేవకన్యలవంటి నా జ్ఞాపకాలు విఫలమయ్యాయి... ఆ మల్లెల పరిమళాలను ఆఘ్రాణించే ప్రయత్నంలో స్వప్న వీణలన్నీ కలిపి ఉఛ్చ్వాశ నిఛ్చ్వాశ అలల ధాటికి పరిపూర్ణత పొందని శిథిల రూపాలై...

by Surya Prakash Sharma Perepa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oQVuiA

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి