#అమ్మఅఖిల్ //నేను వెతుకుతున్నాను// మనీ కాకుండా మనుషులు శాసించే మానవ సంబంధాలను జీవితపు చివరి దశలో కడుపార తిని కనులారా నిద్రపోయే తల్లిదండ్రులను ఈ విద్యా విధానాలతో విసుగులేకుండా చదివే పిల్లలను ఉపయోగపడే విషయాల కోసం అధిక సమయం కేటాయించే యువతను విష సంస్కృతుల మోజులో పడకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే వాళ్ళను పదవి వ్యామోహం కాకుండా ప్రజాసంక్షేమం కోసం పాటుపడే నాయకులను ప్రపంచ దేశాలకు దీటుగా పనికి వచ్చే సినిమాలను తీసి ఆస్కార్ అవార్డ్ తెచ్చిపెట్టే డైరెక్టర్లను అన్ని క్రీడల్లోను గోల్డ్ మెడల్ సంపాదించే క్రీడాకారులను సమాజానికి కావాల్సిన కవిత్వాన్ని అందిస్తూ నిద్రపోతున్న దేశాన్ని లాగి కొట్టి లేపేలా రచనలు చేసే కవులను కవయిత్రులను భావి భారతానికి కావాల్సిన విధంగా పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులను ప్రశాంతమైన జీవితాన్ని గడిపే అటువంటి కొంతమంది వ్యక్తులను నేను ఇప్పటికీ వెతుకుతున్నాను...! 15may14
by Amma Akhil
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iNJ5ql
Posted by Katta
by Amma Akhil
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iNJ5ql
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి