పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, మే 2014, గురువారం

Pulipati Guruswamy కవిత

అటు జరుగు // డా.పులిపాటి గురుస్వామి // గొప్ప ప్రారంభము అంతే గొప్ప ముగింపు నడుమ ,అద్భుతమైన కొనసాగింపు ఏ జీవితానికీ సరిపడదు ఒక రోజులో కూడా అంతే ఐతే కావచ్చు పరిమితిదేముంది...మనం గీసిన తాత్కాలికహద్దు చేయినిండా చేరిన అన్నం ముద్ద ఈ ప్రపంచానికంతా ఆసరా కడుపునిండిన సందర్భమే గొప్ప అవకాశము ,అదృష్టమైనది స్పష్టంగా చూడదగిన కళ్ళు కూడా మనకి లేవు కొన్ని జంతువుల వలె. అవికూడా కాలాంతరాన మబ్బులు కమ్మి గుండెకి పడ్డ చిల్లులా మారిపోతాయి దుఃఖపు బొట్లు విడువటం కోసం మనది కాని ప్రాంతాల్లో మన మాట వినని శరీరాల్తో ఏముందనిక్కడ ? దాచిపెట్టితిమా ఏమైనా? ఏరోజుకారోజు... దొలుపుకుంటూ,మలుపుకుంటూ తోటి మనుషుల మధ్య వినయం నటించుకుంటూ... ఓహ్.....ఇక్కడిదాకా వచ్చాక ఎవగింపు కే ఎక్కువ బలం బచ్చలాకు మీది పచ్చ పురుగులు నయం కాకపొతే మరేమిటి? ఒరేయ్ ఆనందుడా! ఉన్నట్టుగా ఉంటూ లేనట్టుగా మసలుకోవటమే జీవించడంలో నేర్పు. ..... 15-5-2014

by Pulipati Guruswamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1svR8h4

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి