పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, మే 2014, గురువారం

Subhash Koti కవిత

గజల్ ఒక అగ్ని ~~~~~~~~~~~ ఫైజ్ షేర్ లక్షణం గురించి ఒక గొప్ప షేర్ చెప్పాడు, మరణానికి నాలుగైదు రోజుల ముందు; " జలేన జగ్ మే అలావోతో షేర్ కిస్ మక్సద్ " " చలి మంట అంత కూడా లోకానికి వేడి ఇవ్వకపోతే, ఇక షేర్ వల్ల ఏమి ప్రయోజనము? " అందుకేనేమొ గజల్ ఒక అగ్ని అంటారు శేషేంద్రగారు. అంటే కవిత మనిషిలో వేడిని పుట్టించాలి.వేడి అంటే శ్రోత గుండెలో చుర్రుమనాలి.విన్న వెంటనే నోట్లో నుంచి ' వాహ్ ' అనే శబ్దం రావాలి.కావ్యం లోంచి అలంకారం తీసేస్తే నిప్పులో నుంచి ఉష్ణం తీసేసినట్లవుతుంది. ఈ అగ్నిని సృష్టించడానికి ఉర్దూ కవి జీవనాగ్నుల్లో ప్రయాణం చేసి తప్త సువర్ణం అవుతాడు. ఉదాహహరణకు చాలా ఉష్ణోగ్రత ఉన్న ఫైజ్ షేర్ మరొకటి చూడండి; " జిస్ ధజ్ సే కొయీ మక్తల్ మే గయా ఓ షాన్ సలామత్ రహతీ హై యే జాన్ తో ఆనీ జానీ హై ఇస్ జాన్ కీ తో కోయీ బాత్ నహీ- " అలంకరిచుకొని ఉరికంబం వైపు నడచిన అతని తేజస్సు, శాశ్వత శుభం కలిగి ఉంటుంది;ఈ ప్రాణమా వస్తూ, పోతూ ఉండేది,; అదంత గొప్ప విషయం కాదు..." ఈ షేర్ వీరుల ధైర్యాన్ని, వారి నిబద్ధతను మరియు ప్రాణాలను తృణప్రాయంగా భావించే త్యాగనిరతిని వర్ణించాడు కవి. అమరుడైన భగత్ సింగ్ త్యాగం సరిగ్గ ఇటువంటిదే కదా. ( ఆంధ్ర జ్యోతి సచిత్ర వారపత్రిక 1-2-85 లో ప్రచురిత గుంటూరు శేషేంద్ర గారి " గజల్ ఒక అగ్ని " సాహితీ వ్యాసం ఆధారంగా ...)

by Subhash Koti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ltN9O0

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి