కొయిలాడ బాబు //ఎక్కాల బుక్కు// అంకెలతో సావాసం చేసిన చిన్ననాటి శైశవ స్మృతులు ఒకటో ఎక్కం ప్రారంభంలోనే చెప్పాయి చిన్ని చిన్ని పాఠాలు చిత్రంగా బహుచిత్రంగా టీచరమ్మ అడుగుల చప్పుళ్ళో ఎన్ని అర్థాలో తెలియకనే తెలిసేవి గుండెలో మోగకనే మోగేవి టెన్షన్ గంటలు "టిక్ టిక్"మని వంతుల వారిగా ఒక్కొక్కరు యుద్దానికెళ్ళే మొదటి సైనికుల్లా సంఖ్యా సమరానికి సిద్దమవుతుంటే ఏదో తెలియని భావం ఎవరి తర్వాత ఎవరి వంతో అని కన్నార్పకుండా చూసే వేళ సరిగ్గా అప్పగించలేని చిట్టి నాన్నలు మండలు చూపిస్తే చాలు సుర్రున్న తగిలే స్కేలు తాపులు ఇప్పుడు తల్చుకుంటేనే ఎంత మాధుర్యాన్ని బాధగా అందిస్తున్నాయో ఈ చిన్ని గుండెకి ఏమీ తెలియని అమాయక మొహాలకు అవే లెక్కకు మించిన కష్టాలు ఒకడు గొల్లపూడి వీరాస్వామి బ్రాండ్ ని ప్రమోట్ చేస్తే మరొకడు వెంకట్రామా అండ్ కో బుక్కే తెచ్చి చింపి చింపి చిందరవందర చేసేవాడు దాచేపల్లి...గుల్మోహర్ ... ఏవైనా అప్పటికి మాకు అవి మా లెక్కలు తేల్చే ఎక్కాల బుక్కులే 15.05.2014
by Babu Koilada
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lhJ5BT
Posted by Katta
by Babu Koilada
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lhJ5BT
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి