పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, మే 2014, గురువారం

బ్రెయిన్ డెడ్ కవిత

నిశీధి | Vengeance | రేపట్నుంచి ఐదేళ్ళ పాటు శవజాగారం చేయాల్సిన సూచనలు కనిపించటం లేదా ? ఈ ఒక్క రోజు శుభ్రంగా తిని బబ్బో. పొద్దున్న కాఫీ తో ఒకసారి రాత్రి పెగ్ తో ఇంకోసారి (పెగ్ కాకపోతే నిద్రమాత్రల తో ఎహే ..యే రాయి అయితేనేమి పళ్ళు రాలగోట్టుకోవటానికి) చచ్చిపోయిన ప్రజాస్వామ్యానికి రోజు RIP చెప్పుకోవటం ఇంకా పూర్తిగా రక్తంలో ఇంకనే లేదు అపుడే ఇన్నాళ్ళు కనీసం పుస్తకాల్లో బ్రతికున్న సెక్యులరిజం కూడా అదే దారిలో చావు యాత్ర కి రెడీ అయిపోయింది చూసి ఏడు . పీలో ఇండియా పీలో . అవుర్ ఎక్బార్ ఈకలు తీసిన కోడిలా బ్రతికున్న సంతోషం లో తాగు . షైనింగ్ ఇండియా మండబెట్టిన బ్రతుకులని 10 ఏళ్ళ పాటు స్కాం పురుగులు కొట్టేసాక సగం కాలిన శవాల్లా తీన్మార్ కి రెడీ అయ్యి నయా అభివృద్ధి చిప్పలో అడుక్కుందాం రా ! అఫీషియల్ గా పక్కోడి పీకలు కోసుకుతినడానికి సిద్దపడిపో .. నచ్చకపోతే ? ఫికర్ క్యౌ ? నేతల చంకలు నాకటం అయిపోతే నీ బొచ్చెలో ఆల్రెడీ ఉన్న పసితలలు చీల్చిన స్త్రీ గర్భపు నెత్తుర్లు టేస్టిగానే ఉన్నాయి గా అపుడే రుచి మర్చిపోయావా ? ఇండో చైనా భాయి భాయి కి చికిలించిన కళ్ళ వాడు మంగళం పలికేసాక హిందూ ముస్లిం భాయి భాయి కి హ్రదయం చచ్చిన నువ్వు చావు హారతి ఇచ్చుకో . పాత పగల కత్తులు అన్ని బయటకి తీసి కుంకుమార్చనతో సిద్దం చెయ్యి వసుదైక కుటుంబం డ్రామా కి తెరదించి ,నిజరూపం వెలికి తియ్యి . నీ మతం సమ్మతం కాని ప్రతి మనిషిని అడ్డంగా నరికెయ్యి నీ సంస్కృతిలో భాగం కాని ప్రతి మనస్సు ని చంపెయ్యి . ఇన్నాళ్ళు వేసుకున్న ముకౌటా తొలగించి నీ అమానవ అవతారం కి ఇంకోక్కసారి జై కొట్టు . ఎంత కర్కశపు పనులు చేసినా ? ఎన్ని దైవాగ్రహాలు నీవిగా నాటకం ఆడినా ? అఖరికి అన్ని సమాధుల సైజులు ఆరు బై మూడేగా మరపెందుకు? నిజమే.. నీ అభివృద్ధి నీకో పాలరాయి సమాధి సాధ్యం చేస్తుందేమో ...కాని నీ మనస్సు ని తొలుస్తున్న పురుగులు సమాధిలో నీ శరీరాన్ని తొలవటం ఒక్క క్షణం అయినా ఆపగలవా? "అ నేస్తం " ! నిశీ !! 15/05 /14

by బ్రెయిన్ డెడ్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jwBpcc

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి