మరువం ఉష | సోయగానా శోకమే... ------------------------------------ పున్నాగపూలు వర్షిస్తున్నట్లు తెలిమంచు- వెలుపలి దృశ్యానికి, లోలోపలి చిత్రానికి రాకపోకల్లో కనురెప్పల రెపరెపలు కన్ను కి దాహం ఉండదా? విరిసీ విరియని తమ్మిలో చిక్కుకున్న తుమ్మెదలా తీరని మోహావేశపు చింతతో నా చూపు పట్టుకుచ్చులు పేర్చినట్లు పేరిన మంచు- గగనవాడల శిశిరాన్ని, దేహంలో శైత్యాన్ని నమోదు చేసుకుంటూ ఉఛ్వాస నిశ్వాసలు హృదయాన ఉప్పెన రాకూడదా? మునిమాపు వేళల్లో ఆ సంద్రాన పడవలా తీరాన వెలిగే దీపపు కాంతికై నా వగపు 03/03/14
by Usha Rani K
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pSjG5R
Posted by Katta
by Usha Rani K
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pSjG5R
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి