!!విడిపోయిన బందం !! _________పుష్యమి సాగర్ మూడు ముళ్ళు , ఏడు అడుగులు కలిసి ఉంటామంటూ జతగా పెనవేసుకొని తిరిగి తిరిగి అలసిపోయాయి అనుకుంటా ఆర్ధిక స్వాలంబన లో .... పెళ్లి నాటి ప్రమాణాలు పడి కొట్టుకు పోయినపుడు పెద్ధరకం చిన్నబోయినది !!!!.. గృహస్థ ధర్మాన్ని ముడి వేసి... మడి కట్టిన సమాజానికి సవాలు విసిరి ...చేరి సగం కావాల్సిన వాళ్ళు విడి విడి గా అయ్యారు , బాగుంది కాని , రక్తం పంచుకుకొని పుట్టిన కన్న పేగులు ను నిర్దయగా వదిలేసారు !!! అమ్మతనాన్ని నాన్న అనురాగాన్ని పుస్తకాల్లో వెతుకుతూ ... పసి జీవితాలు మోడు వారుతున్నాయి విడి విడి గా ముక్కలవుతూ నడి రోడ్డు పై వంశాకురాలు శాప ఫలం గా మిగిలిపోతున్నాయి !!! మార్చ్ 3, 2014
by Pusyami Sagar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dTPWwY
Posted by Katta
by Pusyami Sagar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dTPWwY
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి