Ramaswamy Blog: nramaswamy.drupalgardens.com నా కవితా సంకలనాలు: 1.'ఓనమాలు' --తొలి కవితా సంకలం,పాలపిట్ట పబ్లికేషన్స్ 2012 2.'అనుధ్వని'--తొలి అనువాద కవితా సంకలనం,పాలపిట్ట పబ్లికేషన్స్ 2012 (ఈ క్రింది కవిత 'ఓనమాల' లోనిది.) ......|| ఉద్భ్రాంత పాంథుడు ॥..... తెలిసినట్టే ఉంటుంది కాని అడవి దారి తెమలదు దిక్కు సరైందనే తోస్తుంది అయినా నావ తీరం చేరదు ఎరిగినవే ఎడారి దారులు ఎంత తిరిగినా సరిహద్దు అందదు ఇలాంటిదే మరి మనిషి జీవితం! దుర్గమారణ్యం దృగంత పర్యంత సాగరం దిగంత పరివ్యాప్త సైకతం మాయదారి మరీచిక లల్లిన మాయాజాలం దారితప్పిన తెరువరై పరిభ్రమిస్తుంటాడు ఉద్భ్రాంత పాంథుడు మానవుడు! (కౌముది ఆగస్ట్ 2010,జయంతి ఎప్రిల్/జూన్ 2011) (ఈ కవితకు' ఎలనాగ' చేసిన ఆంగ్లానువాదం ఈనెల 'వాకిలి' లో ) Mango Bites A Befuddled Wayfarer - Elanaaga • Nagaraju Ramaswamy మార్చి 2014 It appears as though everything is known But the path in the forest never ends Direction seems perfect Yet the dinghy doesn’t get ashore The tracks in desert are not unknown But no amount of treading takes you to the frontier The life of humans is but like this. It’s an impenetrable jungle A vast ocean, spread up to the horizon Infinite sand, stretched to the skyline A magic spell it is, of woven mystical mirages. Man, a befuddled wayfarer, keeps roaming, having lost his way Origin (Telugu): Nagaraju Ramaswamy Translated by: Elanaaga (Dt.02 Mach 2014)
by Ramaswamy Nagaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1abyasW
Posted by Katta
by Ramaswamy Nagaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1abyasW
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి