అందరు అనుకుంటున్నారు నాకేమో అయిందని గాలి సోకిందనో దెయ్యం పట్టింధనో అంటున్నారు నిజంగా వాళ్ళకేం తెలుసు నాకేమయ్యిందో నిన్ను చూసినంక నేను నా స్వాధీనం తప్పానని రివటలా నువ్వు విమల్ చీరకట్టి వెళ్తుంటే నా మది దారి తప్పిందని లోకానికేం తెలుసు వాస్తు తప్పని నీ అణువణువు నన్నో పిచ్చోన్ని చేసింది రెప్ప కొట్టని నా కళ్ళు విప్పారి నిన్నే చూస్తున్నాయి మయూర నాట్యం లాంటి నీ నడక నా గతిని మార్చింది పనిలేదు పాట లేదు ఎప్పుడూ నీ ద్యాసే ఆహారం నీరు నాకెందుకు నువ్వుంటే చాలు ఎంత కాలం ఇలా మరెన్ని రోజులు బతకను నిన్నే కొలిచే ఈ భక్తున్ని కరుణించు చెలి చరితలో నిలిచేలా నీతో వందేళ్ళు బతికేస్త అందరూ అనుకున్నట్లు నాకే గాలి సోకలా నన్నావహించింది నీ ప్రేమే-నాక్కావలసింది నీతో జీవితమే
by Venugopal Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eUaUeA
Posted by Katta
by Venugopal Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eUaUeA
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి