అలల కంటిలో కమ్మనికలగా మారి చూద్దామా గుండెలోతులో వలపులవలగా జారి చూద్దామా కనురెప్పలపై ఎదురుచూపులే దీపాలైతే ముళ్ళబాటపై పాతనవ్వులను ఏరి చూద్దామా నీవు నీవుగా నేను నేనుగా బతుకుతు ఉన్నా ఎడబాటు ఎండలో కాస్తనీడను వెదికి చూద్దామా మంచుపొరల్లో ఇసుకరేణువులు ముత్యాలేగా రాతిమనసుపై చూపుల దుప్పటి పరచి చూద్దామా ఎదలోతుల్లో వెచ్చని ఊపిరి వేడిసెగలతో హృదయసీమలో చలిచీకట్లను తరిమి చూద్దామా
by Abd Wahed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dU40Xe
Posted by Katta
by Abd Wahed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dU40Xe
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి