పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, మార్చి 2014, సోమవారం

Krishna Mani కవిత

మనుషులు ************ అందమైన ఊరిది సుషెతానికి కాదు మనషుల గుండెలు చిక్కని బర్రె పాలే ! రానుబోను కశీరుకాడ పానమైన పిలుపులు యాడికోతున్నవ్ మామ...గీడిదాక పొయ్యొస్త అల్లుడా ! మల్లయ్య తాతో ... ఎమోయ్ పిల్లగా అంత మంచిగనేనా ? ఉన్న తాతిట్ల అని పానమెల్లాగొడతరు ! పిల్ల బాగైనదా సత్తమ్మ షిన్ని ఏంజేతు బిడ్డ్యా.... తీరొక్క మందులు పొస్తినని మంచి చెడ్డలడుగుతరు ! జోన్నరోట్టెందుకూ లేదనక పంచుకతిందురు ! కయ్యమాడ కాలుదువ్వె కడుపుమంట ఉన్నోనికి గిట నలుగురు జెప్పిందే నాయం నలుగురొప్పుకుందే ధర్మం ! కష్టమోచ్చినోడింటి కాడ కాలునోయ్యవుందురు పగోనింట్ల పెండ్లైతె పదిత్తులైన ఏద్దురు ! ఎడ్లబండ్లల్ల జాతరొంగ రానువోను తోవ్వపోడితి బతుకమ్మ పాటలు మల్లన్న ఎల్లమ్మ కతలు ఇంటా జరుగుడు ! ఆపదుంటె యాదికొచ్చె అక్కజేల్లె పానము కార్యముంటే ఆ దినం ఆడివిల్లల మురుసుడు సల్లగుండు అమ్మగారని ఒడిబియ్యం పోసుకొని దీవెనలు ఇత్తురు ! ఎండిన బతుకైన మాటవడని నెత్తురు రోశగాల్లకు రోశగాల్లు మా ఊరి మనుషులు ! కృష్ణ మణి I 03-03-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NLlTkr

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి