వాసుదేవ్ //యుటోపియా// -------------------------- ఇంకా అంతా అయిపోలేదేమొ ముగింపు వెతుక్కునే ఆరంభం మొదలిప్పుడె * * * ఓ హక్స్లి మళ్ళీ రాస్తాడు బాధల్లేని 'కొత్త ప్రపంచం' రక్తచారికల్లేని చరిత్రా, మానభంగాల్లేని మరో చరిత్రా మరో ఇలియెట్ ఓం శాంతి, శాంతి, శాంతిహి జపం చేస్తుంటాడు……. మరణం తన మారణాయుధాన్ని వెనక్కి తీసుకుంటుంది కాలానికి ఇక కాలం చెల్లినట్లే అని జీవితం ప్రకటిస్తుంది ఈ సారి సోక్రటీస్‌ని బతికించుకుందాం ప్రవక్తని మాట్లాడనిద్దాం, శిలువని దాచేద్దాం సత్యమేంటో చెప్పనిద్దాం, కనీసం ఈ సారైనా! జెస్టింగ్ పైలేట్ వ్యాసుడి అవతారమెత్తుతాడు * * * ఈ సారి ఇలా పాడుకోవచ్చు మనందరం కోరస్ గా.... గతాన్ని చెరిపేయ్, చరిత్ర రక్తచారికల్నీ తుడిచేయ్ కాలాన్ని నాశనం చేసేయ్, వయసునీ తరిమేసేయ్ జీవితమెప్పుడూ దానిపాటదే పాడుకుంటాది దాని చరణాలవే రాసుకుంటూ....దాని పల్లవుల్ని అదే కీర్తిస్తూ * * * దేవుణ్ణి శాసించే మనిషి పుడతాడు మనిషికి గుడికట్టె దేవుడూ అవతరిస్తాడు వాల్టర్ మిల్లర్ వేదవాక్యం అప్పుడైనా అర్ధమవ్వాలి 'నీకంటూ ఆత్మలేదు, నువ్వే ఓ ఆత్మ--నీకున్నదో దేహం' * * * ఇంకా ఏమీ అయిపోలేదు ఇప్పుడె మొదలు.... బ్రహ్మాండమైన మొదలిదే అసలుసిసలు యుటోపియా మొదలిదే 26.మార్చి.2014
by Srinivas Vasudev
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fZVG8u
Posted by Katta
by Srinivas Vasudev
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fZVG8u
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి