ఉన్నట్టుండి తెరుచుకున్న నయనాల్లోకి ఓ స్వప్నం దోబూచులాడుతుంది.. ఓ స్మృతి రేఖ పెదాలపై చిరునవ్వు తళుకవుతుంది ఉన్నట్టుండి ఓ లేలేత భావోద్వేగం మేని పులకింతవుతుంది ఓ ఆశా పవనం నుదుటిపై అమ్మ లాలింత స్పర్శవుతుంది ఉన్నట్టుండి ఓ పలకరింపు మూగబోయిన భావాలను నిదురలేపుతుంది ఓ అనుభూతి కెరటం తనువును నిలువునా తడిపేసి వెళుతుంది ఉన్నట్టుండి ఓ పిలుపు శూన్యాలను దాటి జీవితమంతా నినదిస్తుంది ఓ ఓపలేని ఆత్మీయత ఝుంఝుమ్మారుతంలా గుండెను కుదిపేస్తుంది కొన్ని పరిచయాలెందుకు వెంటాడుతాయో కొన్ని ఙ్ఞాపకాలెందుకు వేటాడుతాయో కొన్ని బంధాలెందుకు మనసును కట్టేస్తాయో కొన్ని వ్యక్తిత్వాలెందుకు అస్తిత్వాన్ని కూడా దోచేస్తాయో జీవితమంతా అలోచించినా అంతు చిక్కని ప్రవళిక.. విఙ్ఞానమెంత వృద్ది చెందినా శోధించినా మెదడుకందని ప్రహేళిక మనస్తత్వ శాస్త్ర గ్రంధాలెన్ని ఉద్భవించినా కొన్ని ఫీలింగ్స్ కి కారణాలు దొరకవు . . కదిలించే ఆర్ద్రత తప్ప..! !
by Nirmalarani Thota
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hs8B3X
Posted by Katta
by Nirmalarani Thota
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hs8B3X
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి