పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Santosh Kumar K లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Santosh Kumar K లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, జూన్ 2014, సోమవారం

Santosh Kumar K కవిత

||నాన్నా..|| నాన్నా!! నేను అంటే నువ్వే నా నవ్వుకి కారణం నువ్వే నా ఆశకి అండవి నువ్వే నా నడకకి ఊతం నువ్వే నా విజయానికి ఆది నువ్వే నా వెనకుండి నడిపేది నువ్వే నాలోని నమ్మకం నువ్వే నాకున్న బలం నువ్వే నా మొదటి స్పూర్థివి నువ్వే నా ప్రాణ స్నేహితుడవి నువ్వే నా గణించలేని ఆస్తివి నువ్వే నా భరోసా ధీమా నువ్వే నా భయానికి ధైర్యం నువ్వే నాకున్న పెద్ద వరం నువ్వే నాన్న... నువ్వే!! ఆ దేవుని కోరిక కోరాల్సిన అవసరమెక్కడుంది?? నా కన్నా ముందే నిన్ను నాకోసం పంపాడు నా సుఖం కోసం నిన్ను ఇబ్బంది పెడతాడు నా అవసరాలకోసం నీతో పని చేయిస్తాడు నా ఆనందంకోసం నీకు దుఃఖాన్ని ఇస్తాడు నా కష్టాల్లో నాకు కాక నీకు కన్నీరిస్తాడు నా అనారోగ్యంలో నిన్ను పస్తులుంచుతాడు నా ఎదుగుదలలో నీకు అలసటనిస్తాడు నా సత్ఫలితాలకోసం నిన్ను పరీక్షిస్తాడు నా వినోదంకోసం నిన్ను వేడుకోమంటాడు నా ప్రతి ప్రశ్నకి ఒకే సమాధానంగా నిన్ను చూపిస్తాడు నాన్నా.. నీకన్నా గొప్ప వరాన్ని ఇంకేం ఇవ్వగలడు ఆ దేవుడు!! గమనిక: నిన్న ఫాదర్స్ డే సందర్బంగా రాసిన వచనం ఇది :) #సంతోషహేలి 16JUN14

by Santosh Kumar K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qUAb0A

Posted by Katta

10, జూన్ 2014, మంగళవారం

Santosh Kumar K కవిత

||ఓ గంగమ్మా...|| ఓ గంగమ్మా... ఎందుకే అంత కోపం? మంచు నుండే పుట్టావుగా.. మరెక్కడా కనబడదే ఆ జాడ?? కిందటేడాది ఒక్కసారిగా వచ్చావు, ఊళ్లన్నింటిని ఊడ్చుకెలిపోయావు ప్రతేడు ఎంతోకొంత గిట్టుబాటు అవతుందిగా ఇంకా చల్లారవే.. ఎందుకే మనిషంటే అంత కచ్చి??? నీలో మునిగితే పుణ్యం మాట దేవుడెరుగు పొరపాటున తలుచుకుంటే ఎటు నుండి వస్తావో ఈసారి ఇంకెంతమందిని లాక్కెలతావో అనే గుబులు మిగిలి అంతుచిక్కట్లేదే నీ యవ్వారం!! ఇంకా ఆకలి తీరలేదా?? ఆడదానికి ఇంత ఆశ పనికిరాదు చెప్తున్నా!! ఇలా జనమంతా తిట్టిపోస్తున్నారని నువ్వు ఏడవకులే... నువ్వు మాత్రం ఏం చేస్తావ్.. నువ్వు మంచిదానివే.. నీ మనసూ మంచిదే.. గంగమ్మవి.. అంటే అమ్మవే.. అయితే నిన్ను నిన్నులా ఉండనివ్వడుగా మనిషి మారాజు...!! మారాజు అజాగ్రత్త శాస్త్ర పండితుడు ఏదో అడ్డుకట్టలా ఒక ఆనకట్టు కట్టాడు.. రోజుకోసారి కూత పెట్టి సాగానంపుతానన్నాడు.. నిజానికి శివునికే కష్టమైంది నీ ప్రవాహాన్ని కట్టడి చేయటానికి పాపం అన్నెం పున్నెం తెలియని లేత పక్షులు వాటికేం తెలుసు అమాంతం నువ్వు వస్తున్నావని మనిషి మారాజుకి అంటే అన్నీ తెలుసు.. విశ్వవిజేత కదా.. నీ మాటకి విలువెందుకిస్తాడు.. తెలియక ఇంటి నుండి నవ్వులతో ఆడుతూ పడుతూ గుంపుగా ప్రకృతి అందాలని అందుకోవాలని అప్పుడే వచ్చిన లేలేత రెక్కలతో అలా అలా ఎక్కడి నుండో ఎగిరోచ్చాయి ఆటలో మునిగి తేలాలని అనుకున్నాయి కానీ నీటిలో తెలుకోలేనంత లోతుకి దిగిపోయాయి... కారణం తెలిసే లోపే రెక్కలు విరిగాయి.. కన్నవాళ్ళ కోరికలు కొండెక్కాయి.. కొండ లోయల్లో కొట్టుకుపోయాయి.. కానరాని దూరాలు చేరుకున్నాయి.. ఓ మనిషి మారాజా... సల్లంగా ఉండయ్యా... ఎందరి ఉసురు పోసుకున్నా నీకు ఆయువు తీరదు ఎందుకనో.. నీ చుట్టూ ఉన్నోళ్ళని మింగేయి... నిన్ను నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే!! అప్పుడప్పుడైనా బాధ్యతలు గుర్తుంచుకో... నీకు నువ్వు ఇష్టం లేకపోవచ్చు.. కానీ ఆ కూనల అమ్మా అయ్యలు ఏ పాపం చేసారు.. నీకు చెప్పినా... ఆ గోడకి చెప్పినా ఒకటే... మొద్దు బారిన ఈ మనిషి మారడు.. ఓ మిగిలిన కూనలారా... మీరు మాత్రం ఇలా మారకండి... మరో మారాజు అవకండి!!! (ఆ విద్యార్ధులలో కొందరైనా బతికుండాలనే ఆశతో రాసిన కన్నీటక్షరాలు ఈ వాక్యాలు) :( :'( #సంతోషహేలి 10JUN14

by Santosh Kumar K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tZ9l7f

Posted by Katta

8, జూన్ 2014, ఆదివారం

Santosh Kumar K కవిత

||ఓ వరం.. నాస్తికత్వం|| శీర్షిక : దేవుడు అనేవాడు అస్సలు ఉన్నాడా?? దేవాలయాలు దేవుణ్ణి చేరుకోటానికి మార్గాలా?? దేవుని నమ్మని వాడు దెయ్యాన్ని నమ్ముతాడా?? ఈ ప్రశ్నల సుడుగుండంలో నాలోని ఆలోచనలకి రూపం నేను రాసిన "ఓ వరం.. నాస్తికత్వం" తెల్లారేసరికి గోల పెట్టే సుప్రభాతాలు, అక్కడక్కడ అర్ధమయ్యే అష్టోత్తరాలు, చెప్పిందే చెప్పి విసిగించే సహస్రనామాలు, అవేవి నేను చదవను.. నాకు అనవసరం.. నా కులమేంటో కనుక్కోవాలా?? నా మతంమేంటో మీకు చెప్పాలా?? వినండైతే నేను గోల చేయని మనిషిని, విలువలను అర్ధంచేసుకున్న మానవతావాదిని, మంచిని చెప్పి,చేయాలనుకునే సంఘసంస్కర్తని, ఏంటీ.. ఇలా చెబితే ఒప్పుకోరా? బహుశా అందుకేనేమో ఈ భక్తమహాశయులందరి దృష్టిలో నేనొక మతమెరుగని మూర్ఖున్ని, నేనొక కులమెరుగని కురూపిని, నేను నమ్మని వాడిని నమ్మిన వాళ్ళందరితో దూషింపబడే దోషిని... మరేంచేయను.. నాస్తికుణ్ణి నేను.. ఇలాంటి పిచ్చివాళ్ళని పట్టించుకొని ఇంకొక పిచ్చి వాడిని కాలేను!! #1# జనమంతా మంచోల్లే... పాపమెరుగని పుణ్యాత్ములే... ఎందుకంటే... దండాలు పెట్టేవారే ధరణికోటంతా, కోరికలు కోరేవారైతే కోకొల్లలంట, నేతి కారే వంటలే నైవేద్యాలంట, వండిన ప్రసాదాలన్నీ పైనోడికేనంట, ఆరగించిన స్వామి చల్లగా చుస్తాడంట, పాపాలన్నీ పటాపంచలు కావిస్తాడంట, పూజలూ పునఃస్కారాలు పుణ్యానికంట, ప్రదిక్షణకి తప్పులన్నీ పటాపంచలంట, లెంపలేసుకుంటే చాలు పైనోడు కరిగిపోతాడంట, నీళ్ళని, పాలని నేలపాలు చేస్తారంట, వృధా ఏమాత్రం కాదది అభిషేకం అంట, కొబ్బరికాయలు కొడుతూనే ఉంటారంట, దేవునితో చుట్టరికం ఇలా చవకగా కలపొచ్చంట, ఏంటో భాలేగుంటాయి వింటుంటే ఇలాంటివంతా, మరేంచేయను.. నాస్తికుణ్ణి నేను.. ఇలాంటి విచిత్రాలన్నీ చూసి నవ్వుకుంటాను!! #2# అయినా నాకర్ధంకాదు నాస్తికత్వానికి చోటెక్కడుంది.. అమ్మని నమ్మని మనిషి ఉండడుగా..!! లేదులే అమ్మానాన్నల అవసరం స్వీయ సంపాదన మొదలైనంతవరకే.. ఆ తర్వాత ఆ ముసలి వాళ్లతో పనేముంది, వృద్ధాప్యంలో ఎందుకూ పనికిరారు, వృద్ధాశ్రమంలో వదిలేస్తే సరిపోతుందిలే, అయినా అలా చేయటం పాపం కాదు, కోట్లను ఖర్చు పెట్టి కుంభాభిషేకం చేయిస్తే కోటి తప్పులని చేసినా క్షమార్హులమే!! కానీ నేను వాళ్ళిద్దరని అలా వదిలేయలేను ఏం చేయను.. పూజలు చేయని నాస్తికుణ్ణి నేను పాపం చుట్టుకుంటుందేమోననే భయంతో బ్రతకలేను!! #3# ముక్కుసూటిగా చెప్తాను కొన్ని స్వీకిరించే కర్మను మీకు ఒదిలేస్తూ.. దేవునికి నేనంటేనే ఇష్టం కులమెరుగని నాస్తి(కులం) నాది, అందుకే నేను ఎన్నంటున్నా నన్నేమీ అనడు మరి!! దేవునికి నేనంటేనే ఇష్టం బద్దకమెరుగని బాధ్యతగల పౌరుడుని, భక్తితో భుక్తిని సంపాదించాలనుకునే సోమరిని కాదు మరి!! దేవునికి నేనంటేనే ఇష్టం కానుకలివ్వను.. కోరికలు కోరను, కుదిరితే సాయపడతాను.. చేయూతనిచ్చి చేయందిస్తాను మరి!! దేవునికి నేనంటేనే ఇష్టం కాయాకష్టం మీద బ్రతికేవాడిని, కాషాయం వేసి కాసులు దండుకునే వాడిని కాదు మరి!! దేవునికి నేనంటేనే ఇష్టం నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంటాను, భజనలు చేస్తూ బూటకపు బాగోతాలు నడపను మరి!! ఏం చేయను.. నిజాలు నమ్మే నాస్తికుణ్ణి దేవునికి దాసోహం అంటూ కపట భక్తిని చూపలేను#4# ఇంకా చెప్పాలంటే.. దేవుడు మనల్ని ముందుకి నడిపించే ఒక నమ్మకం అంతేగాని అతీత శక్తుల అద్భుతం కాదు!! 'దైవ చింతన' అంటే గోపురాలలో కాపురం కాదు సమాజ శ్రేయస్సుకి చేయూతనిచ్చి, పేదవానికి పిడికెడైనా దానమివ్వటం!! మంత్రాలు చదివితే మరకలు మానవు, ఉపవాసాలు చేస్తే రోగాలు నయంకావు, హారతులిస్తే చేసిన పాపాలు హరించవు, మంచిని పెంచుకుంటే స్వర్గం నీతోనే సంకల్పంతో శ్రమిస్తే సుఖాలు నీవైపే నీలోని అహమే చెడు.. నీలోని ఆలోచనే మంచి.. అందుకే నన్ను నేను ఎప్పుడూ మోసంచేసుకోను!! నా మీద నాకు నమ్మకం నలుగురిని ఆదుకోగలనని, నా మీద నాకు ధైర్యం కష్టాలలో ఎదురీదగలనని, నా మీద నాకు గౌరవం నా కాళ్ళమీద నిలబడగలనని, నాకేమీ తప్పు అనిపించటం లేదు.. అందుకే నా లెక్కలో ఓ వరం.. నాస్తికత్వం!! #5# #సంతోషహేలి 08JUN14

by Santosh Kumar K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mr3X95

Posted by Katta

31, మే 2014, శనివారం

Santosh Kumar K కవిత

||సిగరెట్టు గుట్టు రట్టు|| మనిషి పోటానికి ఈ రెండూ సరిపోతాయి.. అరంగుళం బుల్లెట్టు అంతకన్నా చవకైన సిగరెట్టు.. భలే మంచిదండోయి ఈ సిగరెట్టు పోతావ్.... నాశనమైపోతావ్.. అంటూ తనే చేసుకుంటుంది తన గుట్టు రట్టు.. అయినా వింటేగా మేధావి మనిషి.. నీళ్ళు దొరకలేదని పొగ త్రాగానంటాడు.. దగ్గుతాడు దగ్గుతాడు.. అయినా ఆపలేడు.. ఆపాలి అనుకోడు.. (మర్చిపోయాను.. ఆడాళ్ళకి కుడా హక్కుందంట) అయినా ఆపలేదు.. ఆపాలి అనుకోదు.. అందరివాడిని అంటుంది మరి ఈ సిగరెట్టు!! ఏదైనా.. దీనిలో విషయం ఉంది... (అక్షరదోషం క్షమించాలి...) ఏదైనా.. దీనిలో విషం ఉందండి... ఈ విషయం విశేషంగా విస్తృతంగా ఆ సిగరెట్టే విన్నవించుకున్నా వినడు.. వినదు... వినలేడు.. వినలేదు.. విషం అని చెప్పానుగా.. చెవులు పనిచేయటం ఆగిపోయుంటాయి.. పోను పోను.. కళ్ళు.. కాళ్ళు.. ఒక్కొక్కటిగా అన్నీ విశ్రాంతి తీసుకుంటాయి!! అందుకని... అలవాటు లేనివాళ్ళు అటువైపు పోవద్దు అలవాటున్నవాళ్ళు దాన్ని వదిలేస్తే ముద్దు గమనిక : ఏదో సరదాగా రాశాను.. కానీ రాసిన విషయం.. ఆ విషం గురించి.. ఆలోచించండి #సంతోషహేలి 31MAY14

by Santosh Kumar K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gPMXg5

Posted by Katta

3, మే 2014, శనివారం

Santosh Kumar K కవిత

||దీవి|| శీర్షిక: "నా బ్రతుకెంత ఘనకీర్తిని తెచ్చిందో తెలీదుకాని,స్వగతమంతా మాయని గాయాలనే మిగిల్చింది", అని ఆవేదనకి గురైన ఒక అనాథ అన్న మాటలు గుర్తొచ్చి ఆ అనాథ బ్రతుకులలోని భారాలను ఆ జీవితాలపై నా భావాలను ఈ కవితాక్షర మాలికలో రాయటానికి ప్రయత్నించాను!! తెగిపడిన మువ్వని నేను.., సవ్వడిని కోల్పోయాను..!! నేలరాలిన ఆకుని నేను.., ఎండుటాకులా మిగిలిపోయాను..!! నేనెవరో తెలియని నాకే నేను.., నిన్నలోనున్న నన్నే నాకన్నీ అనుకున్నాను..!! నాకున్నదేవరో కానరాక ఏకాకినయ్యాను.., అడిగేవాడు లేక.. అడగనూలేక.. అడుగులేస్తున్నాను..!! ఒంటరితనమంటే ఏంటని.. అనాథ బ్రతుకు భారమెంతని.., ప్రశ్నల బంధుత్వాలే తప్ప సమాధానాల బాంధవ్యాలెరుగని.., సంకెళ్ళు వేయని జీవిత ఖైదీని.. ఎలా చెప్పగలను వీటన్నింటికి బదులుని!! సమాధానంలేని ప్రశ్నలు ఎన్నున్నా నాకుండాల్సిన ప్రయోజనాలూ ఉన్నాయి..., నేను పుట్టుకతోనే స్వేచ్ఛావిహారిని, నా కన్న వాళ్ళకి నా మీద అంత నమ్మకం ఉంది మరి!! నేను పుట్టుకతోనే అజాతశత్రువుని, ఎంతోమంది నాలాంటి వాళ్ళకి ఆప్తుడిని అయ్యాను మరి!! నేను పుట్టుకుతోనే పరిశోధకుడిని, చెత్త కుండీలో ఉన్న అన్ని వస్తువులను పరిశీలించాను మరి!! నేను పుట్టుకతోనే ధనవంతుడిని, పసిగొడ్డుగానే నడిరోడ్డుపై నా మీద చిల్లర వర్షం కురిసేది మరి!! తోడులేని నాకు ప్రకృతమ్మ ఒడిలో నీడ దొరికింది, దారిలేని నన్ను రహదారుల రాకుమారుడిని చేసింది!! పూలజల్లుతో స్వాగతించే వసంతాన్ని చూపింది, నేను పని చేసే పూల కొట్టులో అన్ని పూలను చూశానుగా!! మండుటెండల గ్రీష్మాన్ని చెట్టునీడ నుండి చూపింది, ఆ చెట్టుకిందే నేను చెప్పులు కుట్టుకుంటూ ఉండేవాడినిగా!! కన్నీటిని చెరిపే పన్నీటి జల్లుల వర్షాన్ని తెచ్చింది, పెళ్ళిళ్ళలో,పెరంటాలలో నీరు,పన్నీరు నేను మోయనిది ఎదీ లేదుగా!! మేమంతా నీవాళ్ళమేనంటూ శరత్తులో చుక్కలతో చెప్పించింది, రాతిరైనా ఆకాశాన్ని చుక్కలని చూస్తూ టి అమ్ముకుంటూ తిరిగేవాడినిగా!! వణికించే హేమంతాన్ని తెచ్చి నా కష్టాలని చల్లబరచాలనుకుంది, ఆ చలిలో ఎంతోమందిని ఒకే కాలిదోవలో పరిచయంచేసుకున్నానుగా!! ఆకులు రాలే శిశిరాన్ని చూపి రాలే ఆకులను నీకు తోడంపాను అంది, ఆ ఎండిన ఆకులను బుట్టల్లోకి ఏరుకుంటే మంచి సంపాదన వస్తుండేదిగా!! గడిచే కాలంలోని చేసిన పనుల్లో మిగిలిన జ్ఞాపకాలలో ఏనాడూ నేను తోడులేని నీడలేని వాడిని అనే భావం లేకుండా చూసుకుంది ఆ ప్రకృతమ్మ!! ఉరుకుల పరుగుల జీవన పోరాటంలో, ఎటుచూసినా అవకాశమనే అవసరాలు తప్ప, ఆప్యాయతలు అనురాగాలు లేని లోకమిది!! నా వారని.. నాకెవరూ లేరని చింతే లేదు, ఉన్నా మోసం చేస్తారేమో అన్న భయం అసలే లేదు!! అడవిలో తోడులేదంటే అతిశయోక్తి అనుకున్నాను కానీ ఈ జనారణ్యంలో అయోమయంలో సంచరించే మనుషులనే ఈ యాంత్రిక వస్తువులను చూసి ఏమిలేకపోయినా.. ఎవరికీ తెలియకపోయినా.. కాలుష్యమెరుగని కలుషితమవని మనసే ముఖ్యమని మానవడు కాలుమోపని ఈ సృష్టికే తెలియని ఒక దీవిలా మిగిలిపోవటం ఎంత మనోహరమని తెలిసింది!! #సంతోషహేలి 03MAY14

by Santosh Kumar K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nbnnBE

Posted by Katta

10, ఏప్రిల్ 2014, గురువారం

Santosh Kumar K కవిత

||అనగనగా ఓ బస్సు|| ఓ బస్సు.. మా బస్సు.. కస్సుబుస్సులకి అడ్రెస్సు ఏడ్చినా.. మూలిగినా కదలనని మొరపెట్టుకున్నా వదలము నిన్ను వదిలి కదలలేము నమ్ము..!! ఇరుకుగున్నా పర్వాలే ఎంతమందికైనా సరిపోతావే..!! హంస నడకలు మాకు అక్కర్లే.. కన్నెల నడకలైనా నీ ముందు బలాదూరే..!! గతుకుల రాదారులైనా నీకు ఓకే కుంటుకుంటూ సాగే నీ నడకే..!! మిస్సుకైనా మిసెస్సుకైనా ఓ ఎస్సు అంటావే మా ఎర్ర బస్సు!! పిల్లాడికి కిటికీ కట్నమిస్తావ్ ముసలాళ్ళకి ముందర చోటునిస్తావ్ కుర్రాళ్ళకి కనులవిందుని వడ్డిస్తావ్ కండక్టరుకి మాత్రం చిరాకు కోపాన్నిస్తావ్ అయినా సరే మా అందరికీ భలే ముద్దొస్తావ్!! ఆగితే పోదని తెలిసినా.. సమయానికి రాదనే అపవాదు నీకున్నా.. టైముకి చేరదనే కితాబు నీదైనా.. అలగము మేము... అరవము మేము.. ఎందుకంటే నువ్వేకదా మా అందరికీ స్వర్ణ రథము!! సామన్యుడికి నువ్వే పుష్పకవిమానము మురిపించి చేర్చేవు మమ్మల్ని మా గమ్యస్థానము!! #సంతోషహేలి 10APR14

by Santosh Kumar K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lNebCU

Posted by Katta

8, ఏప్రిల్ 2014, మంగళవారం

Santosh Kumar K కవిత

||ఆవులింత|| ఓ ఆవులింత! నీ ఉనికి కాసింత వయసు గోరంత నీ రాకతో ఒళ్ళంతా అదేంటో కమ్మని కవ్వింత నీ విలువ కొలవలేనంత నిద్రాదేవతకి నువ్వెంతంటే అంత ఆమె కటాక్షానికై జనమంతా జాగారాలు చేస్తున్నా రాత్రంతా కరగదే నీ మనసు రవ్వంత నువ్వు లేని లోకమొక వింత చూడటమాపి చేరొచ్చుగా చెంత నీ తోడు నాకొక తుళ్ళింత ఈదేస్తా అలవోకగా జగమంతా నువ్వుంటే చాలే ఓ ఆవులింత!! #సంతోషహేలి 08APR14

by Santosh Kumar K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1emzjdM

Posted by Katta

3, ఏప్రిల్ 2014, గురువారం

Santosh Kumar K కవిత

||శిథిలం|| శీర్షిక : చినిగిన కాగితంపై వ్రాసిన కావ్యం ప్రణయమనే నాగిని కాటేసిన జీవితం!! అటువంటి జీవిత పతనానికి గల కారణాల విశ్లేషణ నేను వ్రాసిన ఈ కవిత్వం. ప్రేమలో మోసపోయిన ప్రతి ప్రేమికుడికీ అంకితం నా ఈ "శిథిలం"!! మంచు అక్షితలే కురిసేవి నీతో సాగే పయనంలో.. మలయమారుతాలు వీచేవి నీతో గడిపే సమయంలో.. పన్నీటి జల్లులు తుళ్ళేవి నిను చూసే తరుణంలో.. అలా ఊహకందని ఓ అందమైన జీవితాన్ని కాదంటూ.. కుదరదంటూ వెల్లిపొయావు.. వాస్తవాలన్నీ వికృతంగా వెక్కిరించేలా నీ వియోగంతో నిదురలేచిన నాకు కల్లోలమైన లోకాన్ని పరిచయం చేసింది అనుక్షణం కన్నీటికి నానినాని తడిచి ముద్దైన నా కనుపాపలను వదిలి వెళ్ళలేక కొలువై ఉన్న నీ రూపం!! ఆ క్షణమే గ్రహించాను.. జాలి ఎరుగని విధి ఆగ్రహాన్ని.. నిజానికి నేను నడిచింది ఎడారి త్రోవలో ఎండమావులతో నిండిన ఎండాకాలమని, అడుగు సైతం వేయలేని ముళ్ళదారని, కరుణలేని కానరాని కటికచీకటని, నీ అనుగ్రహానికి నోచుకోని నా జీవితానికి మిగిలింది గ్రహణమని నేనొక వెలుగెరుగని కలుగు వాసినని.. మదిగదికి జీవిత ఖైదుని విధించి విషాద ఊబిలో చిక్కుకుపోయి అనాథగా మిగిలిన అసమర్థుడనని.... కానీ అడగకుండా ఉండలేకపొతున్నాను అతి మధురమైన తల్లి ప్రేమని అనిర్వచనీయంగా చూపుతారు కదా, హృద్యమైన అనురాగ బంధంతో ఒక కూతురిగా తండ్రిని ప్రేమిస్తారు కదా, తోబుట్టిన అన్ననీ, తమ్ముడినీ అక్కున చేర్చుకుని సాకుతారు కదా, మనువడి కాలు కందకుండా ముద్దాడుతూ మోసుకు తిరుగుతారు కదా, జీవితమంతా ఇందరి మగవాళ్ళని ఆదరించి ఒక్క ప్రియుడి విషయంలో మాత్రం ఎందుకని కనికరించరు?? అవునులే మనకు రక్త సంబంధం లేదు కదా మమకారం అనే మత్తుని పరిచయం చేసినా ఆప్యాయతనే ముసుగులో అవిటివాడిగా మార్చినా ప్రతిక్షణం సఖియే ప్రపంచం అన్నట్టు ఏమార్చినా ఒక్కసారిగా ప్రేమశిఖరాగ్రం నుండి నయవంచన కావించి నట్టేటిలోకి తోసేసినా అడిగేవాడు ఉండడు అనే ధైర్యం నీది.. పొరపాటున అడిగినా సరే.. మగాడివి నువ్వు, ఆత్మహత్య చేసుకోటానికి సిగ్గులేదా అని నీ తప్పుని మరిచి నాదే ఒక తప్పని నిరూపించే సమాజం మనది!! అయినాసరే.. నా ఒటమికి నాదే భాద్యత.. ఎందుకంటే, ఒట్టేసిన చేతికి తెలియదు పాపం తను కేవలం చేతకాని చెయ్యిని అని, నీ చేతిస్పర్శ మంట పుట్టించే ఒక చురకని...! చూసిన కంటికి తెలియదు పాపం తను చూసింది కేవలం పైపైన మెరుగులని, నిలువెత్తు నిఖార్సైన నకిలీలేని బంగరం కాదని...! వింటున్న చెవికి తెలియదు పాపం చిలిపిపలుకుల ఆంతర్యం చైత్రంకాక శిశిరమని, మాటలతో ప్రణయాన్ని మదించటం సులభమని...! అన్నింటికిమించి నా హృదయానికి తెలియదు పాపం మన ఎడబాటుకి, నా ఎదపోటుకి కారణం నువ్వని, నీ జ్ఞాపకాల గాయాలకు ఛిద్రమైన తాను ఒక శిథలమని!! #సంతోషహేలి 01APR14

by Santosh Kumar K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gkksQS

Posted by Katta

1, ఏప్రిల్ 2014, మంగళవారం

Santosh Kumar K కవిత

||శిథిలం|| శీర్షిక : చినిగిన కాగితంపై వ్రాసిన కావ్యం ప్రణయమనే నాగిని కాటేసిన జీవితం!! అటువంటి జీవిత పతనానికి గల కారణాల విశ్లేషణ నేను వ్రాసిన ఈ కవిత్వం. ప్రేమలో మోసపోయిన ప్రతి ప్రేమికుడికీ అంకితం నా ఈ "శిథిలం"!! మంచు అక్షితలే కురిసేవి నీతో సాగే పయనంలో.. మలయమారుతాలు వీచేవి నీతో గడిపే సమయంలో.. పన్నీటి జల్లులు తుళ్ళేవి నిను చూసే తరుణంలో.. అలా ఊహకందని ఓ అందమైన జీవితాన్ని కాదంటూ.. కుదరదంటూ వెల్లిపొయావు.. వాస్తవాలన్నీ వికృతంగా వెక్కిరించేలా నీ వియోగంతో నిదురలేచిన నాకు కల్లోలమైన లోకాన్ని పరిచయం చేసింది అనుక్షణం కన్నీటికి నానినాని తడిచి ముద్దైన నా కనుపాపలను వదిలి వెళ్ళలేక కొలువై ఉన్న నీ రూపం!! ఆ క్షణమే గ్రహించాను.. జాలి ఎరుగని విధి ఆగ్రహాన్ని.. నిజానికి నేను నడిచింది ఎడారి త్రోవలో ఎండమావులతో నిండిన ఎండాకాలమని, అడుగు సైతం వేయలేని ముళ్ళదారని, కరుణలేని కానరాని కటికచీకటని, నీ అనుగ్రహానికి నోచుకోని నా జీవితానికి మిగిలింది గ్రహణమని నేనొక వెలుగెరుగని కలుగు వాసినని.. మదిగదికి జీవిత ఖైదుని విధించి విషాద ఊబిలో చిక్కుకుపోయి అనాథగా మిగిలిన అసమర్థుడనని.... కానీ అడగకుండా ఉండలేకపొతున్నాను అతి మధురమైన తల్లి ప్రేమని అనిర్వచనీయంగా చూపుతారు కదా, హృద్యమైన అనురాగ బంధంతో ఒక కూతురిగా తండ్రిని ప్రేమిస్తారు కదా, తోబుట్టిన అన్ననీ, తమ్ముడినీ అక్కున చేర్చుకుని సాకుతారు కదా, మనువడి కాలు కందకుండా ముద్దాడుతూ మోసుకు తిరుగుతారు కదా, జీవితమంతా ఇందరి మగవాళ్ళని ఆదరించి ఒక్క ప్రియుడి విషయంలో మాత్రం ఎందుకని కనికరించరు?? అవునులే మనకు రక్త సంబంధం లేదు కదా మమకారం అనే మత్తుని పరిచయం చేసినా ఆప్యాయతనే ముసుగులో అవిటివాడిగా మార్చినా ప్రతిక్షణం సఖియే ప్రపంచం అన్నట్టు ఏమార్చినా ఒక్కసారిగా ప్రేమశిఖరాగ్రం నుండి నయవంచన కావించి నట్టేటిలోకి తోసేసినా అడిగేవాడు ఉండడు అనే ధైర్యం నీది.. పొరపాటున అడిగినా సరే.. మగాడివి నువ్వు, ఆత్మహత్య చేసుకోటానికి సిగ్గులేదా అని నీ తప్పుని మరిచి నాదే ఒక తప్పని నిరూపించే సమాజం మనది!! అయినాసరే.. నా ఒటమికి నాదే భాద్యత.. ఎందుకంటే, ఒట్టేసిన చేతికి తెలియదు పాపం తను కేవలం చేతకాని చెయ్యిని అని, నీ చేతిస్పర్శ మంట పుట్టించే ఒక చురకని...! చూసిన కంటికి తెలియదు పాపం తను చూసింది కేవలం పైపైన మెరుగులని, నిలువెత్తు నిఖార్సైన నకిలీలేని బంగరం కాదని...! వింటున్న చెవికి తెలియదు పాపం చిలిపిపలుకుల ఆంతర్యం చైత్రంకాక శిశిరమని, మాటలతో ప్రణయాన్ని మదించటం సులభమని...! అన్నింటికిమించి నా హృదయానికి తెలియదు పాపం మన ఎడబాటుకి, నా ఎదపోటుకి కారణం నువ్వని, నీ జ్ఞాపకాల గాయాలకు ఛిద్రమైన తాను ఒక శిథలమని!! #సంతోషహేలి 01APR14

by Santosh Kumar K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gkksQS

Posted by Katta

26, మార్చి 2014, బుధవారం

Santosh Kumar K కవిత

|| కాశ్మీర దర్శనం || శీర్షిక : గత వారంలో నేను చేసిన వినోద యాత్ర లో ఆ ప్రకృతి మాత నాతో రాయించిన కవితాక్షరాలివి!!! తరగని అందానికి తను నిలయం అలుపెరుగని ఆహ్లాదం తన సొంతం విసుగనిపించని విస్మయాల విశ్వం అంబరాన్నంటే ఆనందానికి ఆలయం వీటన్నింటికి ఒకటే గమ్యస్థానం భూలోకస్వర్గమైన కాశ్మీరం... దూరాన తెల్లటి పరదాల వెనుక ఎత్తైన శిఖరాలను చూస్తుంటే మనిషి కోరికలను పోలినట్టు అనిపిస్తూ కోరికల వేటలో భయం ఆశలను కప్పి ఆశయాలపై అసహ్యాన్ని కలిగిస్తుంటే ఆ దేవుని అక్షింతల రూపంలో కురిసే మంచు వర్షాలు నింపే స్పూర్తికి భయం భస్మమై హిమములా మారినట్టనిపిస్తుంది.. అంతేకాక వణుకెరుగని ఆ హిమ నందనాన్ని గమనిస్తే కార్యసాధనలో పట్టువీడని మానవ ప్రయత్నాన్ని గుర్తుచేస్తూ.. కాల గమనంలో అనుక్షణం ప్రకృతి, మనిషి రెండూ సమానమని తెలుస్తుంది... అనుక్షణం అబ్బురపరిచే అద్బుతాల సమాహారంతో ఎన్నో కోణాలను పరిచయంచేసే జీవిత ప్రతిబింబం వాల్మీకి ఎరుగని మనోహరమైన సుందర కాండం తప్పకుండా చెయ్యవలసినది ఈ కాశ్మీర దర్శనం... #సంతోషహేలి 25MAR14

by Santosh Kumar K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gyvNTa

Posted by Katta

9, మార్చి 2014, ఆదివారం

Santosh Kumar K కవిత

||ఎడారిపూలు|| శీర్షిక : నవ సమాజంలో వేశ్యని చూస్తున్న తీరుని.. తన జీవితాన్ని ఆవిష్కరించే కోణాన్ని విపులంగా వివరంగా విన్నవించే ప్రయత్నమే నా ఈ కవితామాలిక.. "ఎడారిపూలు" దేవుణ్ణి పూజించి దారుణాల్ని ప్రోత్సహిస్తాం, మూగజీవాలను బలిచ్చి మొక్కుబడులని చెప్పుకుంటాం, దిక్కులేని బీద బాలికలలో దేవదాసీలను సృష్టిస్తాం, బలిపశువలను చేసి బరితెగించారని హేళన చేస్తాం, విధి వంచితలైన వనితలను వేశ్యలుగా మారుస్తాం, జీవితమనే పదానికి వికృతమనే అర్దాన్ని నేర్పిస్తాం, అయినాసరే మనుషలం మనం.. మంచివాళ్ళమని చెప్పుకుంటాం!! చీకటి నీడల్లో విరక్తిని మింగి మెతుకులకోసం బతుకుని వేలం వేసి ఋతువేదైనా రతీ రాణి తానై ఋతుక్రమమైనా రక్తిని పంచుతూ రాకాసి రోగం ఱంకెలు వేసినా, రక్తం విరిచినా రోదన చూపక రెక్కల కష్టాన్నే నమ్ముకుంటుంది.. వేశ్య కదా పాపం, ఎవరితోను చెప్పుకోదు!! ఎందుకంటే మంచి మనుషలం మనం..., ఏ క్షణంలో కూడా చెడుని వినం..!! తోడులేని ఒంటరితనంలో దిక్కులేక మౌనంతో కేకలు వేస్తుంటే వీచే గాలి సైతం జాలితో చూసి తన పైటంచుతో కల్లు తుడుస్తుంటే నడ్డినంటిన నాభిని చూడగ జాతిలేని వీధి కుక్కల గుంపు గుమ్మిగూడి మాంసపు ముద్ద ధరని అడిగి అంగటిలో సరుకని పదే పదే గుర్తుచేస్తున్నపుడు ప్రశ్నించలేదు.. వేశ్య కదా తన కష్టాయణం వినపడదు ఎందుకంటే మంచి మనుషలం మనం..., ఏ క్షణంలో కూడా చెడుని మాట్లాడం..!! చిగురించే విత్తుకి సూరీడే అండ కానీ తన ఆశలపైరులో కీచక పర్వాలు దుశ్శాసన దుర్మార్గాలే దారినిండా.. డబ్బిచ్చి కులుకు మగాడు రసికుడని దేహకూలీ అయిన తను జాతిహీనమని ఆధునిక సమజమిచ్చిన తీర్పుకి లెక్కలేనన్ని కన్నెరికాలను కానిచ్చింది వేశ్యే కదా తన గోడుని పట్టించుకోము ఎందుకంటే మంచి మనుషలం మనం..., ఏ క్షణంలో కూడా చెడుని చూడం..!! వికసించే మందారమే ప్రతి మగువ రంగులు వేరైనా అందానికి నిలయమే అతివ కానీ ఎంతందమున్నా.. ఎన్ని రంగులున్నా అంతులేని అంతరంగాల గతాలను మింగి తుమ్మెదలతో వ్యాపారం చేసే ఈ ఇంతి పెళ్ళిచేసుకోని ఒక గొప్ప పతివ్రత అవే లక్షణాలున్నా వివక్షకు గురై వాటి ఉనికినే మరిచాయి ఈ విరులు.. తేనెని కాక కన్నీటిని చిందే ఎడారిపూలు!! #సంతోషహేలి 09MAR2014

by Santosh Kumar K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ioArVc

Posted by Katta

1, మార్చి 2014, శనివారం

Santosh Kumar K కవిత

||నీ స్నేహం|| శీర్షిక: ఒక యువకుని మదిని తట్టిలేపిన సౌందర్యాన్ని ఇలా వర్ణిస్తూ ఆ సుందర స్నేహన్ని కోరుకుంటూ ఇలా అంటున్నాడు... తేనె గానాల కోయిల పిలిచిందో వసంత రాగాల గాలి వీచిందో సెలయేరు సప్తస్వరాలు పాడుతుందో ఏమైందో తెలియని ఆనందల కచేరీలో ఈ లోకమంతా ఎందుకో కొత్తగా ఉంది.. సరదాల సందడులు పిలుపుచెసాయా అన్నట్టు ఎదలో ఉల్లాసం ఉప్పొంగి ఉరకలేస్తుంది... ముందెపుడు లేని ముచ్చట్లన్నీ నింగినంతా నిండి ఉన్న నీలంలా నా చుట్టూ చేరి తెగ కబుర్లుచెప్తున్నాయి... కారణాలు ఏంటని ఆరా తీస్తే.. ఉత్సాహం రెట్టింపు అయినట్టు, కోరికలు తీరే కాలమొచ్చినట్టు, కలలు నెరవేరే వేకువ పిలిచినట్టు, ఆహ్లాదాల అంబారీలో ఊరేగినట్టు.. ఉత్సాహాల తీరంలో నేనుండగా కోరికల కలల అలలు పోటీపడుతూ కాలం కన్నా వేగంగ ఎగసిపడి ఆహ్లాదంతో నన్ను హత్తుకుంటున్నాయి... అదే అదే చెప్తున్నా... ఎందుకంటే... ముగ్ద మనోహరమైన ఓ మగువా లలిత లావణ్యమైన నీ మనసుతో కోమలమైన నీ చేతి స్పర్శతో నను తాకితే తరించనా తక్షణం.. అయినా ఓ సోయగాల సొగసరి, సోకుల బందీఖానావి.. మన్మథుని ఊహాచిత్రానివి నువ్వు... ఏమని వర్ణించగలను నీ నవ్వు... నా కళ్ళలో తొలిసారిగా నీ ముఖారవిందం వికసించింది.. నా చూపులకు తొలిసారిగా నీ గులాబీ చెక్కిల్లు పరిచయమయ్యాయి.. నా చెవులకు చిలిపిగా నీ పలుకులు సరిగమలను ఆలపించాయి.. నా ఊహలకు ఊపిరినిస్తూ నీ జాలువారే కురులు సయ్యాటలాడాయి.. నా మురిసిన ఆలోచనలో నీ మెరిసిన దరహాసం నాట్యమాడింది... ఆ తరుణంలో.. వెలకట్టలేని నీ పరిచయంలో అనువనువునా తోడు నీడగా నేనుంటా.. పున్నమి రాతిరి వెలుగులా మారి నా మదినిండా నిన్నే నింపుకుంటా.. నీ సమయంలో క్షణ కాలాన్నిస్తే చాలు అందులో నా జీవితాన్ని మలుచుకుంటా.. నా ప్రేమ దివిసీమలో నీరాకతో ప్రణయ ప్రయాణానికి తొలి అడుగులువేసి నా సంతోషానికి ఒంటరి చిరునామాగా నువ్వుండాలనే కాంక్షతో కోరుకుంటున్నా నీ బంధం.. నీ స్నేహం... #సంతోషహేలి #Sanoetics 01MAR2014

by Santosh Kumar K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kBTRmM

Posted by Katta

22, ఫిబ్రవరి 2014, శనివారం

Santosh Kumar K కవిత

|| ఎండుటాకులు || దిక్కు తోచక.. దారి తెలియక దయచూపే నాధుడే లేనపుడు దేహి అని అర్ధించకు..!! దయాగుణం దేవుడెరుగు.. దేహాన్ని దోచుకుపోతున్న దానవుల సామ్రజ్యం ఇది...!! ఆహ్లాదం కనుమరుగాయేను వర్షానికి బదులు ఆమ్లాలు కురుస్తున్న తరుణంలో.. తోడులేని ప్రయాణము అసాధ్యమాయెను.. తిరిగొచ్చే మార్గమంతా తోడేల్ల మందలతో నిండిపోగా.. దుర్మార్గుల దుస్సహసాల దారుల్లో తెగిపడిన అమాయకపు అవనుల గొంతులు ఎన్నో...!! నిజమని వేడుకున్నా.. అరాచకమని అరిచినా.. వినపడదు.. కనపడదు.. భయపెడుతున్న భవిష్యత్ చీకట్లలో కళ్ళులేని న్యాయదేవతకు!! నింగికెగిసెను... అంతరించిపోయెను.. ఆశలు కావవి.. ఆవిర్లు కావవి.. ప్రాణాలు కావవి...! ప్రతి ఆడకూతురి అడియాశల కలయికలో ఆవిరైన ఉత్సాహాలు రెక్కలు లేని పక్షుల్లా బధపడుతుంటే చూసి.. నవ్వి.. హేలన చేసి పట్టుకోలేనంత పైకెగిరిపోయెను వాస్తవ సమాజంలో కనికారం చూపే మనసులు.. అవి కలిగిన మనుషులు.!! కోరిక కోరితే కోపాలు తలెత్తి చూస్తే ఛీవాట్లు నలుగురిలో నవ్వితే నవ్వులపాలు మాటలొస్తున్నా మాటాడలేని మౌనాలు ఒకటా రెండా.. ఇంతి పడే ఇక్కట్లు గోడుచెప్పని జీవమెరుగని ఎండుటాకులు!! #సంతోషహేలి #Sanoetics 22FEB2014

by Santosh Kumar K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jnmDaN

Posted by Katta

17, ఫిబ్రవరి 2014, సోమవారం

Santosh Kumar K కవిత

||నీ రాకతో|| నీ చిరునవ్వులో విరిసిన రంగులను చూసి కనులు మూసి బోసిపోయింది ఆ హరివిల్లు... నీ తలపుల్లో తలమునకలైన నా ఆలోచన అలుపెరగని ఊసుల కారగారంలో బందీగా మారిన నిమిషంలో... నా తీరే కొత్తగా ఉంది.. నీ ఉనికిని పసిగట్టిందేమో..! నా మనసు మౌనం వీడింది.. నీ మాటలను విన్నదేమో..! నా ఊహ ఊపిరి పోసుకుంది.. నీ శ్వాస తగిలిందేమో..! నా ప్రేమ తొలి అడుగులు వేసింది.. నీ నడకలో చేరిందేమో..! అలా నేను ప్రేమించటం మొదలుపెట్టిన క్షణం నుండి... కవ్వించే నీ కౌగిలిలో చేరుకోవాలని గమ్మత్తుల మత్తులో తూలుతూవున్నా..! సోయగాల పూలు పట్టుకోవాలని పులకింతతో నీ కురులవైపే చూస్తూవున్నా..! వెచ్చని ఒడిలో కాసేపు సేదతీరాలని చలిగాలిలో సైతం నీ చెంతకు చేరాలనుకుంటున్నా..! అంతటిలో తొలకరి మేఘమై చేరవచ్చి.. వేచిచూస్తున్న ఎదపై తేనెజల్లు కురిపించావు, మంచులా మారి ప్రణయ మారుతంలా వీచి.. కలలలో విహరిస్తున్న నన్ను పలకరించావు, పరిచయం చేసుకున్నావు, పునర్జన్మనిచ్చావు!! #సంతోషహేలి #Sanoetics http://ift.tt/1jvhwEF

by Santosh Kumar K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jvhwEF

Posted by Katta

4, ఫిబ్రవరి 2014, మంగళవారం

Santosh Kumar K కవిత

||ప్రేమ నాణెం|| ప్రేమ.. ప్రేమలో ఉన్న ప్రేమికులను ప్రేమిస్తే... హాయి రాగాలతో సాగే మౌన గీతాల సంగీతమై వినిపిస్తుంది..!! చూపుల పలకరింపులతో కనుసైగలు చెప్పే కబుర్ల కాలక్షేపమవుతుంది..!! అందమైన అలకలతో కవ్వించే కోరికల వినోదాన్ని పంచుతుంది..!! ఊహల ఊసులతో మరుపురాని తలపులు చేసే ప్రమాణమవుతుంది..!! చిలిపి చిరాకులతో పలకరించే పరాకుల సరసమవుతుంది..!! కస్సుబుస్సుల కసురులతో తేనె కోపాలు వ్రాసే కమ్మని కావ్యమవుతుంది..!! ఇలా ఆనంద చిరునామాల బంధాన్ని చేరువ చేస్తూ చిరునవ్వుని చిందించే సంబంధాన్ని చూపిస్తూ తనలో ఒకవైపును పరిచయం చెస్తుంది ఈ ప్రేమ నాణెం !! ఫ్రేమికులు ఏది మరిచినా పర్వాలేదు కానీ ఆ ప్రేమనే మరిస్తే... వీచే గాలి సైతం విరహ వేదనతో నిండుకోగ వియోగ రాగంలో శ్రుతిలేని సంగీతాన్ని మ్రోగిస్తుంది!! చూపుల దారుల్లో చెరిగిపొని స్మృతులన్నీ చేరగా కన్నీటి చుక్క ఒంటరిని అయ్యానని కన్నీటి పర్యంతమవుతుంది!! కోపంలో అలిగిన కాలం అంధకారం మిగల్చగా అనాథగా మిగిలిన స్నేహం తోడు కిరణాల నీడ కోసం వెతుకుతుంది!! ఊపిరి అందక ఊహలన్నీ కొట్టుమిట్టాడగా మరుగునపడ్డ తలపులన్నీ మరణమంచున మిణుకుమిణుకుమంటున్నవి!! చిరాకులో చిరిగిన ఆశ ఆఖరి శ్వాసలో ఉండగా పంతంతో ప్రాణం కోల్పోతున్న ప్రేమ బ్రతకాలని ఆరాట పడుతుంది!! కన్నెర్రజేసిన కోప తాపాలు తీరని వైరాన్ని కోరుకోగా విరిగి ముక్కలైన మనసు విషాద సాహిత్యాన్ని రచిస్తుంది!! ఇలా విచార గుండంలో చిక్కుకుని ఒడ్డుకి చేరటంలో విఫలమైన ఓడలా చెదిరిన చెలిమి చిగురించదనే చేదు నిజం దిగమింగుతూ తనలో రెండోవైపుకి తెర తీసి ఏడిపిస్తుంది ఈ ప్రేమ నాణెం !! జ్ణాపకాల పాఠశాలలో అనుభవాలు నేర్పించిన పాఠం.. వలపు మలుపుల్లో మది వ్యధను వ్యక్తపరచలేక విస్మయం.. సుఖ-దుఃఖాల మైత్రిలో ఏది మిగులునో తెలియని అయోమయం.. జంట భావనల ఒంటరి నిలయం.. ఎన్నో జీవితాలను శాసించే ఈ ప్రేమ నాణెం!! 03.02.2014 #సంతోషహేలి

by Santosh Kumar K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1icfokE

Posted by Katta

3, ఫిబ్రవరి 2014, సోమవారం

Santosh Kumar K కవిత

||ప్రేమ నాణెం|| ప్రేమ.. ప్రేమలో ఉన్న ప్రేమికులను ప్రేమిస్తే... హాయి రాగాలతో సాగే మౌన గీతాల సంగీతమై వినిపిస్తుంది..!! చూపుల పలకరింపులతో కనుసైగలు చెప్పే కబుర్ల కాలక్షేపమవుతుంది..!! అందమైన అలకలతో కవ్వించే కోరికల వినోదాన్ని పంచుతుంది..!! ఊహల ఊసులతో మరుపురాని తలపులు చేసే ప్రమాణమవుతుంది..!! చిలిపి చిరాకులతో పలకరించే పరాకుల సరసమవుతుంది..!! కస్సుబుస్సుల కసురులతో తేనె కోపాలు వ్రాసే కమ్మని కావ్యమవుతుంది..!! ఇలా ఆనంద చిరునామాల బంధాన్ని చేరువ చేస్తూ చిరునవ్వుని చిందించే సంబంధాన్ని చూపిస్తూ తనలో ఒకవైపును పరిచయం చెస్తుంది ఈ ప్రేమ నాణెం !! ఫ్రేమికులు ఏది మరిచినా పర్వాలేదు కానీ ఆ ప్రేమనే మరిస్తే... వీచే గాలి సైతం విరహ వేదనతో నిండుకోగ వియోగ రాగంలో శ్రుతిలేని సంగీతాన్ని మ్రోగిస్తుంది!! చూపుల దారుల్లో చెరిగిపొని స్మృతులన్నీ చేరగా కన్నీటి చుక్క ఒంటరిని అయ్యానని కన్నీటి పర్యంతమవుతుంది!! కోపంలో అలిగిన కాలం అంధకారం మిగల్చగా అనాథగా మిగిలిన స్నేహం తోడు కిరణాల నీడ కోసం వెతుకుతుంది!! ఊపిరి అందక ఊహలన్నీ కొట్టుమిట్టాడగా మరుగునపడ్డ తలపులన్నీ మరణమంచున మిణుకుమిణుకుమంటున్నవి!! చిరాకులో చిరిగిన ఆశ ఆఖరి శ్వాసలో ఉండగా పంతంతో ప్రాణం కోల్పోతున్న ప్రేమ బ్రతకాలని ఆరాట పడుతుంది!! కన్నెర్రజేసిన కోప తాపాలు తీరని వైరాన్ని కోరుకోగా విరిగి ముక్కలైన మనసు విషాద సాహిత్యాన్ని రచిస్తుంది!! ఇలా విచార గుండంలో చిక్కుకుని ఒడ్డుకి చేరటంలో విఫలమైన ఓడలా చెదిరిన చెలిమి చిగురించదనే చేదు నిజం దిగమింగుతూ తనలో రెండోవైపుకి తెర తీసి ఏడిపిస్తుంది ఈ ప్రేమ నాణెం !! జ్ణాపకాల పాఠశాలలో అనుభవాలు నేర్పించిన పాఠం.. వలపు మలుపుల్లో మది వ్యధను వ్యక్తపరచలేక విస్మయం.. సుఖ-దుఃఖాల మైత్రిలో ఏది మిగులునో తెలియని అయోమయం.. జంట భావనల ఒంటరి నిలయం.. ఎన్నో జీవితాలను శాసించే ఈ ప్రేమ నాణెం!! 03.02.2014 #సంతోషహేలి

by Santosh Kumar K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1icfokE

Posted by Katta