పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, మార్చి 2014, బుధవారం

Abd Wahed కవిత

సాంప్రదాయికంగా గజల్ కు ఉన్న ’’ప్రేయసితో సంభాషణ‘‘ అన్నఅర్ధానికి అనుగుణంగా ఒకే రదీఫ్ ఖాఫియాలతో వీలయినన్ని షేర్లను, ఒక సుదీర్ఘ గజల్ గా తెలుగులో రాస్తే... ఈ ప్రయోగం ఎలా ఉందో పాఠకులే చెప్పాలి. నాల్గవ విడత ఐదు షేర్లను ఇప్పుడు పోస్టు చేస్తున్నాను. ఇప్పటికి పదిహేను షేర్లు అయ్యాయి. పదహారవ షేర్ మరో మత్లాగా రాశాను. మత్లాతో కలిపి చదివితేనే గజల్ అందం. గజల్లో ప్రతి షేర్ దానికదే స్వతంత్రంగా ఉంటుంది, కాబట్టి ఇలా ఒక యాభై లేదా వంద వరకు షేర్లు రాయాలన్నది ఆలోచన. ఈ ప్రయత్నం ఎలా ఉందో చెప్పడం మరిచిపోవద్దు.. ప్రతిమాట తేటతెనుగు తీయదనము లాగున్నది ప్రతి శ్వాస సన్నజాజి పూలవనము లాగున్నది వెలుగుతెరలు పిట్టల్లా గూడుకట్టి చెట్లపైన చూస్తున్నవి చంద్రముఖికి స్వాగతము లాగున్నది ముత్యాల్లా మిలమిలమని మెరుస్తున్న మాటలు దేవవీణ తీగల్లో సంగీతము లాగున్నది మంచుతెరలొ దాగిఉన్న మల్లెపూల దరహాసం కుచ్చీళ్ళలొ చిక్కుకున్న చక్కదనము లాగున్నది వినువీధిన తారకలే నేలవాలి పోయాయా నీ వాకిట ముగ్గులతో అద్భుతమూ లాగున్నది

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QfuQVb

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి