పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, మార్చి 2014, బుధవారం

Bhaskar Kondreddy కవిత

దాము || వొత్తిడి || నువ్వు పాదం మోపిన చోటల్లా నీలిపడగ విన్యాసం బుసకొడుతుంది. మరీచక దూరానికి చేయి చాసేందుకోసం మళ్లీ ఒక ప్రయత్నం చేస్తావు. దట్టంగా కమ్ముకున్న జీవితంలోంచి వూపిరాడక గిలగిలలాడతావు. వినేందుకు హృదయం దొరకదు, పువ్వుకాదుకదా, తొడిమకూడా చిర్నవ్వదు. ప్రేమలాంటి నక్షత్రఖచిత ఆకాశమొకటి స్వప్నంలా బులిపిస్తుంది. ఎవరు తెరుస్తారు కిటికీలు? గుహతొలిచే పులికోసం అన్వేషిస్తావు. ఎప్పటికప్పుడు నీడను తరిమికొడతావు. కనిపించిన దారెంబడి నడుచుకుంటూ పోతావు. ఎవరొస్తారు తోడు? కత్తులులేని ఆకురాయి గరుకుతనం యవ్వనచర్మం పొడవునా వొరుసుకుంటూ వుంటుంది. భూమికన్నా శరీరం భారమవుతుంది. దేహం గుండా భూమధ్యరేఖ దూసుకుపోతున్న చప్పుడికి ఉలిక్కిపడతావు. పోటెత్తే రక్త సముద్రానికి హై బిపి అని పేరెడతాడు డాక్టరు. మెదడు నిండా క్షణాలు ఉబ్బిన శవాలవుతాయి. మృదువైన సంధిగ్థ సంధ్య కూడా ఈడిపస్ కాంప్లెక్స్ లా అనీజీగా కమ్ముకుంటుంది. వున్నట్టుండి కట్టలు తెంచుకున్న మురికినది వొక్కటి నీలోపలినుంచి లోపలికి వొరుసుకుని ప్రవహిస్తుంది. క్రమంలోంచి క్రమం పుట్టి క్రమంలోకి వెళ్లిపోతుంది. నువ్వొక ధీర్ఘ నిశ్వాసమవుతావు. 21/12/94,... ప్రవాహగానం నుంచి. 26/3/14

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P1ssQJ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి