కవిత్వ మొక అవసరం ----------------------------శ్యాం ప్రసాద్ బెజవాడ కాదు నాకది అలంకారం కవిత్వం నాకొక అవసరం నన్ను నిలువరించే వివరం మీరు వినేలా తెల్పుకోనొక వరం! తల్లి వంట, చేసేదే పిల్లల కోసం వారు తినక, మరి దేని కోసం? వారు తినటమే, ఆమె అవసరం అందుకే అమె చేస్తుంది, మరో రసం! కవి కన్నబిడ్డలే కావ్యకన్యకలు వారి చిరంజీవమే, కవి కోరికలు అందుకు సాగే పాకాలే, ప్రాసలు విభిన్న నుడికారపు యాసలు! తెలియజెప్పాలి విషయమెలాగయినా కాదనుకుంటే, చేదాటిపోతుందాపైన జీవనయానం, అపరిమితం కాదు శవమైపోయాక వూరట అవసరం లేదు! ముసలితనంలో ముచ్చటగా కనలేరు గ్రీష్మమొచ్చాక ఆకు తొడగలేదు జీవన సత్యాలు విడచి నడువలేరు పథ్యానికీ, పంతానికీ కూడ సమయం అడుగలేరు! అందుకే అనుకున్నది సాధించటం అవసరం అసలు సమయాన్ని శాసించటం అవసరం తెలివి తప్పిపోయినట్టుండే ఒక్క క్షణం తెలిసి వేధించేస్తుంది జీవిత మనుక్షణం! స్పృహకయితే సమయం నిరంతరం మత్తుకు మాత్రం మాత్ర మితమే విశ్లేషణలు సాగాలి కాలానికి అనుగుణం అందు నిర్ధ్వంధ నివేద ననేదొక సుగుణం! అందుకే కావాలదొక అలంకారం కవిత్వం సమాజానికో అవసరం స్వర సంధానంలో నిలిపిన వివరం జనం వినేలా చెప్పుకోగల వరం!
by Syam Prasad Bezawada
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P1surG
Posted by Katta
by Syam Prasad Bezawada
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P1surG
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి