పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, మార్చి 2014, బుధవారం

Sriramoju Haragopal కవిత

వుయ్యాల జీవితం గాలిపొరల్లో నా మాటలు, పాటలు, నా దుక్కాలు నా వాగ్దానాలు వుండే వుంటాయి వెలుగుల్లో వుండేవుంటాయి నా కంట్లోని చిత్రాలు, మెరుపులు మరకలు, వానతడి సింగిడీలు మొగులు మీది జారేటి మబ్బులు నేలమీద రాసిన మెరుపుల రాతల్లో నా రుతువులుండే వుంటాయి పారేటి కాలువల్లో పారబోసుకున్న పచ్చివిత్తనాల మొలకనవ్వులు దాచుకునేవుంటాను దున్నిన పొలాల్లో నాగేటిసాల్లళ్ళో నా బతుకమ్మ నన్నెత్తుకుని పాలిచ్చి పాలించే వుంటది ఎన్ని కన్నీళ్ళు గుండెమత్తళ్ళు దుంకినా భరోసా యిచ్చిన మనుషుల మనసుల వేల చేతిస్పర్శలుండే వుంటాయి లేకపోతే... నేనె్ట్లా జీవించివుందును ఎవరో నన్ను ఆత్మీయంగా మోహనం చేయకపోతే ఎవరో నన్ను నా సమస్తదోషాలను ఇగిరించి మిగిలించకపోతే ఎవరో నన్ను నా చిన్ని చిన్ని ఈస్థటిక్స్ ని ఒప్పుకోకపోతే ఎవరో నన్ను నన్నుగానే ప్రేమిస్తూ వుండకపోతే నేనెట్లా సాగుతున్నయాత్ర నయ్యేవాడిని మరుపురాని బాటలెన్ని తిరిగినానో మనసునింపిన తోటలెన్ని గడిపినానో ఆకాశమార్గాన పాఁవురమున్ననా కలలెగిరిపోతున్నా నా ఆకలి తీర్చింది నా మట్టితల్లే

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gA3uUs

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి