లక్ష్మణ్ స్వామి || దగ్ధ మోహన గీతం !! || కరకు శిలా పుష్ప పత్ర ఆకు రాగపు శిలాజం జ్వలిత నేత్ర పర్వత నయనం అరణ్య వీణ కొ౦డ గుహలో నాదం ! ఇసుకరేణువుల కేంద్రకాల్లో ప్రకంపన కడలి అడుగున తడబడ్డ కెరటం గుడ్లగూబ నేత్రపు చూపుల్లో అంగారక సౌందర్యం !! గబ్బిలాలబిలాల్లో చలరేగిన ఆర్త నాదం తాజ్మహల్ పునాదుల్లో పావు ‘రాళ్ళు’!! ఎండమావుల్లో చంద్రవదన మాయా మొహం దాహం తీరదు ! అగ్నిశిఖల్లో ఆవిరి చినుకు కునుకు తీస్తూ ... శిథిల ఆలయాల్లో సమాధైన ఓంకారం! పూల పెదాల సుధల్లోకి జాలువారిన అక్షరం పొన్న చెట్టు వేళ్ళ అడుగున సన్నాయి పాట వింటూ సమాధి ఆత్మల తన్మయం ! నెత్తుటి ద్వారాల్లోనుండి జాలువారిన వెన్నెలని కాల్చిన లావా ! బిచ్చగాడి పళ్ళెం లో పరవశిస్తున్న oనాణెం, ఖణ్ ఖణ్ మంటూ ...! చర్చి గంటలు ఆకలి మంటలకు తోడయి జ్వలిస్తూ ...! నక్క స్వప్నంలో నగ్నమైన యువరాణి పరాభవానికి తోడేళ్ళ దండోరా ! నీరెండిన భావిలోని కప్ప కన్నీటి కొలనులో విచ్చుకున్న కలువ ఆరే ఆఖరిదీపం ! రాలు పూల పాటల్లో రెల్లుగడ్డి పూల గర్జన! గడియారపు ‘ముళ్ళు’ దిగి ఉబికిన రుధిర వరదల్లో చేపల హంగామా !! వడ్రంగి పిట్ట చెక్కిన బొరియల్లో ని వజ్రాల మూటల రాశులకి కాపలా వున్నా కాల నాగులు ! కోన ఊపిరిని కొవ్వత్తిని చేసి ప్రాణ దీపాన్నాపే శ్రామికుని గొంతు పై వేలాడుతున్న ఖడ్గం ! కుత్తుకల్ని కోసే కసాయి స్వప్నాకాశాన కారుణ్య జాబిలి ! మన్మధున్ని కాల్చేసిన విభూధి నుండి ఉన్మాది ఆధ్యాత్మికం ! చీమలు వెంటే గొర్రెలు మేకలు ... చిలుక పలుకుల సారంగి ! నెమలి మా౦సం తింటూ జాతీయ గీతం పాడే ‘మార్లు మాతంగి’ సవా లక్ష భిన్న పూల విలక్షణ కాందీశీక కవి సంచి నిండా కమిలిన, అమలిన అక్షర పుష్ప భాష్పాలు !! -----------------26 -03 - 2014
by Laxman Swamy Simhachalam
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h8VpES
Posted by Katta
by Laxman Swamy Simhachalam
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h8VpES
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి