చెత్త బతుకు *********** చేతిలో మొల గుచ్చిన కట్టే సంకకు సంచి తెగిన చెప్పులు సుడ సక్కని పకీరులం మాలెసపోద్దుకు మునుపే లోకానికి బరువైన సొత్తుకై ఉరుకులాట ఎక్కువ బతుకులను నింపడానికి ! కుక్కల పందుల సహచర్యం ఆకలిడోక్కల ఆరాటం పాషిన వంటలు మురిగిన పళ్ళు పారేశిన కుప్పల అధికారులం ! ఇనుము ప్లాస్టీకు కాగితాలు ఇవే కదా ఆధారం ఇదే మా జీవితం విసిరిన వస్తువు కంటికి ఇంపు మంచివి చెడ్డవి అన్నీ మావే బరువును పెంచుతూ ఆశలు అల్లుతూ రేపటి రోజుకు చెదరని చూపు ! తక్కువగాని చెత్త నోయ్యని కాలు పగలు దాటితే సాగని నడకలు చేరని తీరం దించిన మూటలు అమ్మిన కష్టం అందిన సొమ్ముతో మొఖాన ఆరని వెలుగు మురిపెం ! లోకం మురికిలో మసలే ముల్లుజల్లలం బతుకు అడవిలో నిత్య వేటగాల్లం ! కృష్ణ మణి I 26-03-2014
by Krishna Mani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rxUAdm
Posted by Katta
by Krishna Mani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rxUAdm
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి