సాఫల్యం ------------ రావెల పురుషోత్తమ రావు శబ్దానికో శక్తివుందనీ అర్ధానికో అవధి వుంటుందనీ శబ్దార్ధాల సంయోజనకు శరసంధానపు బిగువుంటుందనీ తెలిసిన కవులకు అవధుల్లేని ఆనందం ఆర్ణవమై నిలుస్తుంది అందుకే శతక వాజ్మయ స్వారస్యం తెలిసుకుంటే జీవన రధం సాఫీగా సాగుతుంది. వేమనను చదివినప్పుడు వేదననడగించుకునే విధానం అలవరచుకున్నాను. సుమతీ శతక పఠనంతో సూక్తిసుధాకరంగా బ్రతుకును మలచుకోగలిగాను. భర్తృహరిని భావార్ధకంగా పఠించడంతో జీవన గమ్యాన్ని సులుసూత్రంగా కలుపుకున్నాను. శ్రీధర్మపురినివాసుని చదవడంతో సిరి వెంట నా గమనాన్ని చీదరించుకుని నిష్కర్షతో మిగిలాను శతక వాజ్మయ సాహచర్యం సుఖినో భవంతు అంటూ జీవితాన్ని ఆశీస్సులతో అందిపుచ్చుకుని అజరామరంగా బ్రదుకు బాటను తీర్చిదిద్దుకునే వీలు కలిగించింది అందుకే ఆకవులందరినీ ప్రాతః స్మరణీయులుగా ప్రతినిత్యం తలచుకుంటూ సాహిత్యపొరోహిత్యాన్ని సక్రమ పంధాలో నడిచేలా జాగ్రత్త పడుతూ జాగరూకతతో అడుగులు ముందుకేస్తు జీవన పధంలో ఒడిదుడుల్లేకుండా సాగుతున్నాను ********************************07-02-2014
by Ravela Purushothama Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fXu2Mu
Posted by Katta
by Ravela Purushothama Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fXu2Mu
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి