పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//ఎరా...ఎలా ఉన్నావ్?// వీడేంటి! గ్లాసుని చేత్తో పైకెత్తి ద్రవాన్ని రెండుసార్లు తిప్పి నవ్వుకొని తాగాడెందుకు? హాస్యమాడదామని పక్కటేబులులో కూర్చున్న బాల్యస్నేహితుడికి ఫొన్ చేసి ఎత్తగానే పక్కకు తిరుగు బే అంటే తిరిగి ఇక్కడే ఉండి ఫొన్ ఎందుకురా అనగానే ఓ గుద్దు గుద్ది ఏమైపోయావ్ అంటే బారంగా రోజూ వత్తానే ఉన్నాను అన్నాడు ఇంకేంటి కబుర్లు అంటే చేతిలో సిగరెట్ లాక్కొన్నాడు ఆ చేతిలోది ముంది కాల్చరా అని ఇంకోటి ఎలిగించుకొని నాకా మాత్రం చనువులేదా అనిపించుకొన్నాకా అనుమతి తీసుకొని నా టేబులులో కూర్చున్నా... తొలి సిప్ తాగానో లేదో వచ్చి నాపక్కన నుంచుని ఇంకేంటి విశేషాలని అడిగాడు అన్నీ సశేషాలే విశేషాలేముంటాయ్ అనగానే వాడితో సహా సభలో అందరూ నవ్వులే సరే ఉంటా అన్నాడు తల ఎత్తి సరే అనేలోపు వాడు లేడక్కడ.....06.02.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l3oJwP

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి