పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Pusyami Sagar కవిత

జవాబు దొరకని ప్రశ్నలు _____ పుష్యమి సాగర్ ఓ దయ గల తల్లి ... కోరికల సెగలలో నువ్వు కాలి పోతున్నప్పుడు వెన్నల రాత్రుళ్ళు , వెచ్చదనపు చెలమలు చీకటి పొదల గుంపుల్లో భావ ప్రాప్తి అందించిన చెమట చుక్కల్లో నువ్వు మైమరచి పొతునప్పుడు గుర్తు కు రాలేదా....!!!!! రెండు క్షణాల సుఖం కదపు లో పిండం మై సమాధానం లేని ప్రశ్న ని సందించి నిలదీసినపుడు పలాయన వాదానికి మారు గా నిలబడ్డావెందుకు ...!! పాపపు ఫలితం పేగులకు చుట్టుకొంది పోనీ లెద్ధురు ....అవాంచిత గర్భమని గంట లో దేవుడు ఇచ్చిన ఫలాన్ని చిదెమిసి రక్తం లో బయటకు పంపావు ... నీ పుట్టుక మరచితివా ....!!!! మానవత ను మంట కలిపి వినాశాకరపు ఆలోచన ను వంటి కి చుటుకొని మరో ఆనంద లోకం లో విహరిస్తూ వున్నావు నడి వీదులలో ...దిక్కు మొక్కు లేక చిరిగి పోయిన జీవితపు విస్థరాకులను గుర్తు తెచ్చుకో ...!!!! అయ్యో ...ఇదెక్కడి చోద్యం !!! స్రీలు పూజింప బడాలని బొడ్డు కోసిన దగ్గర్నుంచి చెవుల్ల్లొ ఇల్లు కట్టుకొని చెప్తూనే... పసి పిల్ల పుట్టింది అని .. పెంట కుప్ప లో, రోడ్డు పక్కన నాలా లో dead or alive గా పడేసి నీవు ప్రతి పూట పేపర్లకు ...బుల్లి తెరలకు ఎక్కటం ద్వంద నీతి కి మారు కాదా.....!!!! ఇక్కడ వీధికో కుంతి లు ఉన్నంత కాలం గజానికో చెత్త కుప్పలలో కను మూసిన అనాధ శిశువుల ... ఆత్మ ఘోషలు ...వినిపిస్తూనే వుంటాయి....!!! (07-feb-14) (రోజులు నిండని పసి పిల్లలను చెత్త కుప్ప లో పడేసిన వార్త ను చూసి కలత చెంది రాసిన కవిత )

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kjLdvN

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి