పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Ramabrahmam Varanasi కవిత

చెవికి సోకని బధిరులు వారణాసి రామబ్రహ్మం 7-2-2014 కుక్కలు పిల్లులు మన ప్రేమకు తోటి మనుషుల కన్న ఎక్కువగా నోచుకుంటున్న నేడు బంధములేవి రాగములేవి? అటకెక్కినవి అన్ని అనుబంధములూ మనుషులలో మంచితవమును మర్యాదను గౌరవించుటలను అందరు మనుషులను అభిమానించటను నేర్పు చదువులు హుళక్కి చేసికొని; ఇంగితము మరచి అన్నిటికీ రక్షక భటులపై ప్రభుత్వములపై ఆధారపడు అమాయకత్వాన్ని పెంచుకున్న మనకు; మృగముల వంటి మనుషులనుంచి రక్షణ ఎటులదొరకును? అమెరికా వెళ్లి తెలుగువారు అందలముల నెక్కెదరు స్వంత రాజధానినుంచి వెళ్ళగొట్టబడెదరు? దీని భావమేమి తిరుమలేశ! ? కులములోని తోటివారికి అందనీయక ప్రభుత్వములిచ్చు తాయిలములను తాము మాత్రమే వంశ పారంపర్యముగా కొల్లగొట్టుకొను కుల కునాయకులు దుర్బలము చేయుచున్నారు దేశమును; తాయిలములను ఒక సారి అందుకున్న వారే, సైంధవులై మరల మరల అనుభవించుచున్నారు!! తమ పేద వెనుకబడిన సోదరులకు ఎంత మాత్రమూ అందనీయడము లేదు ఏ తాయిలములను వీరి ఈ ధాష్టీకమునకు దురాగతములకు తెరవేయువారులేరు ఓట్లకై వంతపాడువారే అందరు కురాజకీయ నాయకులూ!!!! దేశము సంఘము ; మాటలు కోటలు దాటించుచు పనిదగ్గర పడుకొను పనికిమాలిన నాయకుల వల్ల బాగుపడవు, అభివృద్ధి చెందవు కులము చూసి, మతమునకు భ్రమసి ప్రాంతీయ భావమునకు ప్రాణమిచ్చి ఓట్లు వేయు సోదరసోదరీమణులకు మిగులునది మాటల ఫలహారము మాత్రమే నిత్య జీవనము మాత్రము అష్ట కష్టములమయము ఈ తెలివితక్కువ తనమునకు అందరమూ; దురాగతములకు దుష్పరిపాలనకు అలవాటు పడి అలమటించ వలసినదే అవినీతి సంద్రమున మునిగి పోవలసినదే పంచతంత్రము రామాయణము మహాభారతము భాగవతము ఇతర ఆస్తిక నాస్తిక సద్గ్రంథముల ఉపయోగించుకొని జీవించని జాతి; అలో లక్ష్మణా అని వ్యథల వేదనల విచక్షణలకు గురి అగుచూ, హుందాతనము లేని జీవితముల ఈడ్చుకొనుచు; తమ దౌర్భాగ్యమునకు ఎవరిని నిందించవలనో నిందించుకొనవలనో తెలియని అయోమయమున అఘోరించవలసినదే ఆర్తి నొందవలసినదే "మేధావులు" కుల మత ప్రాంతముల పేరుతో విడిపోయి కాట్లాడుకొనుచున్న నేడు ఏది జాతికి ఆశాకిరణం? ఏది జాతికి ఆదరణీయం? ఏది జాతికి ఆచరణీయం? ఏది జాతికి గౌరవం? ఏది జాతికి విముక్తి? చెప్పే నాథుడే లేడే చెప్పినా వినలేని బధిరులే అందరూ!!!!

by Ramabrahmam Varanasi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Mw1v6c

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి