పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎
తిలక్ బొమ్మరాజు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తిలక్ బొమ్మరాజు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, జూన్ 2014, ఆదివారం

తిలక్ బొమ్మరాజు కవిత

తిలక్ / పంక్తి __________ ఇసుక పిచ్చుక ఇవాళ ఇంకా రాలేదేంటో జల్లిన మనసు రేణువులన్నీ ఎదురుచూస్తున్నాయి సూర్యుడి తుమ్ములు భూమి నిండా వెలుతురు పిట్టల తుంపరలు నేలంతా కళ్ళతో అద్దిన ఆకాశం కళ్ళలో నీలపు రంగేసుకుంటూ కనబడింది సంధ్యాకాలపు దోసిళ్ళలో అరుణ విత్తనాలను తాగుతూ జీవం రెక్కలు విప్పిన కొబ్బరాకులు రేయంతా చేతులూపుతూ విశ్వానికి గాలి విసురుతూ గుండె చెలమలు ఇంకని వేళ అనుభవాల గుప్పెట్లో కొత్త పాఠాలు నీటిపుంతలు ఉప్పుసంద్రాలై తీపిగురుతుల మట్టి వాసన మనసు తడియారకుండా కొత్త జీవితం షురూ మరణం తరువాత ఆత్మగా పాత పంక్తి సమాప్తం అసంతృప్తిగా తిలక్ బొమ్మరాజు 16/06/14 22/06/14

by తిలక్ బొమ్మరాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TjxdXR

Posted by Katta

19, జూన్ 2014, గురువారం

తిలక్ బొమ్మరాజు కవిత

తిలక్/రెప్పల కిటికీ __________________________ కిటికీ బయట ఒళ్ళు విరబూసుకుని పడుకున్న చీకటి రాత్రిని ఎక్కువగా తాగినట్టుంది ఒకటే మత్తు వాసన నక్షత్రాలు కూడా తమ శరీరంలో ఖాళీలను నింపలేనంతగా తయారయ్యింది కొండలు చెట్లు ఆకులు పువ్వులు అడవులు చిక్కగా మునిగిపోయాయి చేతులు కాళ్ళ నిండా నల్ల రక్తమే నా కళ్ళు ఎంతసేపు అద్దుకున్నాయో రెప్పల తలుపులు మూసేశాయి రాత్రి ఎప్పటికో ప్రొద్దున్నే నే లేచాక చూసిన తెల్లటి ఉమ్మెత్త పూల నురగ అక్కడంతా/ఇంతలా నిండిన చిక్కదనం మాయమయ్యాక ఇక ఎప్పటికీ నమ్మబుద్దికాలేదు నాకు నాకు తోడుగా ఉంటుందనుకున్న పదార్థమేదో కొత్త రంగేసుకుపోయాక మిగలాలనిపించలేదిక్కడ పచ్చికలన్నీ ఏడ్చి ఏడ్చి తమ శరీరంపై నీళ్ళ బిందువులయ్యాయి ఈ క్షణం/కణాలన్నీ కదలలేక మెదలలేక ఒంటరి యుద్ధంలో పావురాళ్ళై నేలకొరిగాయి ఇక ఎప్పుడూ ఎదురుచూడలేదు మళ్ళా కరిగిపోయే దానికోసం తిలక్ బొమ్మరాజు 19/06/14

by తిలక్ బొమ్మరాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/T96jBQ

Posted by Katta

17, జూన్ 2014, మంగళవారం

తిలక్ బొమ్మరాజు కవిత

తిలక్/అవే కళ్ళు The unpredictable only substance may view you sometimes... Let them Let it allow....Life goes and flows కొన్నిసార్లు జీవించాలనిపించడం సహజమేనేమో ఏ ఆత్మకైనా ఆత్మాభివృద్దికి కారణమైన విత్తనాలు జీవితంలో ఎక్కడో చోట తారసపడుతూనే ఉంటాయి తనపై కూర్చుని విర్రవీగుతున్న కాండపు ఆకుల్లాగా వేర్లు లోనెక్కడో దాక్కొని పైకిమాత్రం డాబుగా కనిపించే వృక్షం కూడా ఏదోక క్షణాన నేలకొరగాల్సిందేనేమో జీవన పయనంలో కొన్ని మజిలీలు గురువులుగా నీ ప్రక్కగానే వెడలిపోతుంటాయి నువ్వు గుర్తుపట్టలేనంతగా విజయమో అపజయమో నిబద్ధతను నేర్పిన చేతులు మళ్ళీ కనబడకుండా ఎవరో ఒకరు చెప్పాలి మనకు ఆ ఆనవాళ్ళను నువ్వు కూడా చూశావని అప్పటి వరకు దుమ్ము పట్టిన గత అనుభవాలన్నీ మరుగున పడుంటాయి నీ వెనకెక్కడో నిలుచుని వీపును తడుముతుంటాయి నువ్వు ముందు నిలబడేందుకు కాని స్వయంకృషి రక్తంపైన నరాల క్రింద దాచుకున్నట్టుగా ఒక నిషా ఇప్పుడు అవే పాత కళ్ళు నీకెదురుగా అక్షరాలు దిద్దిస్తున్నాయి మళ్ళాఒకసారి తిలక్ బొమ్మరాజు 17.06.14

by తిలక్ బొమ్మరాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1vzIDVs

Posted by Katta

14, జూన్ 2014, శనివారం

తిలక్ బొమ్మరాజు కవిత

తిలక్‌/మరో ________________ మట్టిలో నేను నాపై మట్టి కొత్త వడగళ్ళు నా శరీరానికి చలిమంట వేస్తూ తుమ్మ ముళ్ళ కరచాలనం రక్తపు శివార్లలో చిత్తడి నేలలో నా అడుగుల స్నానం ఎంతసేపో తెలియకుండానే తడారడం ఇంకా గుర్తే కాసేపు భూమి సూర్యుడితో ఎంగిలిపడ్డాక తనను ఆకాశపు కొళాయి క్రింద పరచుకుంటున్నప్పుడు నా చుట్టూ అలుముకున్న చతురస్రం కపాలంలో కొత్త మలుపులు వెతుక్కుంటూ నా ఆలోచనలు మస్తిష్కపు సంధుల్లో సేద తీరుతుండగా అరువు తెచ్చుకున్న రాత్రిలో పదునుగా నన్ను కోస్తూ చితిబజారు నుండి విసిరివేయబడ్డ కార్బన్‌ గోళాలు స్వేచ్ఛగా నా ముఖంపై దొర్లుకుంటూ నన్ను ఐక్యం చేసుకునేందుకు కాటుకదడి తెరుస్తూ మూస్తూ తిలక్‌ బొమ్మరాజు 29/05/14 14/06/14(వర్షం వచ్చివెళ్ళాక)

by తిలక్ బొమ్మరాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1veyIVj

Posted by Katta