పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, జూన్ 2014, గురువారం

Maddali Srinivas కవిత

శాశ్వతానందాన్వేషణ//శ్రీనివాస్//19/6/2014 --------------------------------------------------- భావ జలప్రవాహ గర్భ మీన మస్తిష్కం లో లాభ నష్టాల రాజు స్థిరుడై మేకపోతు నాలుక పై కపట వాగ్గంభీరాఖ్యుడు నాట్యం చేస్తుంటే విక్రమాల కొలువుకు రేడు యెద్దు నొదిలిపెట్టేసి తూకానికెక్కితే,మనసును కమ్మిన ధూమ కేతువాతని కబళిస్తే గృహ మేధి, యిల్లు విడిచి,గురువింట్లో శత్రు రాజు వశమై ,కర్మ బ్రష్టుడైతే రోగాన బడ్డ కర్మాగారపు యజమాని వక్ర గతుల్లో ఆదాయానికి గండి కొడితే అప్పులే ఆదాయాలు ఖర్చులే వైభోగాలు అధోపతనంలో అంతిమ స్తానం చేరుకోవటమే అసలు విజయంలా వెక్కిరిస్తుంటే, తప్పదింక తిరుగుబాటు యిల్లాలే యింటి దీపానికి చమురు కావాలి బిడ్డలు మాణిక్యాలై మెరవాలి తుప్పట్టిన సంసార రధచక్రాన్ని సరి చేసేందుకు అగ్ని రగలాలి ఆవేశం కావాలి గృహ మేధికి బంధనాలు తెగిపోవాలంటే అనుభవాల వుపాధ్యాయుణ్ణి శరణు వేడాలి ఆటంకాల కంటకాలు తొలిగించుకోని బలహీనపు కోణాలను సరి చేసుకోని ధాతువిచ్చే వాడితో నెయ్యం చేయాలి వక్ర మార్గాలకు మరమ్మత్తులు చేసి భవిష్యత్తుకి బంగారు బాట వెయ్యలి వేయి రేకుల కమలాన్ని చుట్టుకున్న కోశాలన్నీ దాటేసెయ్యాలి మూలంలో చుట్టుకున్న సర్పాన్ని నిద్ర లేపాలి ఆ పైదాక దానితోకట్టుకోని నడవాలి గమ్యం చేరాక ,మార్గం తో పనేముంది సంతోషంగా సెలవు తీసుకోవాలి పునరాగమన గమనాల కు స్వస్తి చెప్పి ఆనందంలో తేలి పోవాలి

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lGZYnL

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి