శ్రీనివాస్ !! వాడంతే !! ---------------- నిన్నేకదా ప్రేమగా పిలిచాడు ఈరోజు నైజం నెత్తురులా కక్కనివ్వు మాటెప్పుడూ ఒకటే అనుకున్నావేమో నాణేనికి బొమ్మా,బోరుసులా రెండు నాలికలు వాడికి. చీకటి గడియ వేసుకుంటే రాతీదేవిలా ఓ కంటికి నువ్వు వెలుగు కళ్ళాపి చెళ్ళున ముఖంపై తాకినప్పుడు రాక్షసిలా మరో కంటికి. నిరాశ,నిస్పృహలు ఆవహించి నిస్సహాయుడిలా నిలబడినప్పుడు ధైర్యాన్నిచ్చే రుక్మిణివి మగతనం మీసంలా మొలిచినప్పుడు కాలికింద నల్లువి. కునుకు తీసే సమయాన కంటికి రెప్పలా..ఇంటికి దీపంలా.. కోపం రగిలిన క్షణాన తూట్లు తూట్లు వొళ్ళంతా రూపం మారేలా పాపానికి ప్రతీకలా. దేహం పులిసిపోయింది.. జీవితం అలిసిపోయింది.. ఊపిరి ఆగిపోయింది.. మరో బలిపశువు కోసం తా(ళి )డు పసుపు పులుముకుంటుంది కసిగా పీకలు కొయ్యటానికి ! 19-06-14
by Gubbala Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lGZY7m
Posted by Katta
by Gubbala Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lGZY7m
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి