పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, జూన్ 2014, గురువారం

Prasad PV కవిత

|| అమ్మా.. ఇక ఉంటాను || నీ యెద చప్పుడు నాకు వినిపిస్తూనే ఉంది.. నీట్లో బురదమట్టి కింద బండరాయిల్లో ఇరుక్కున్న శరీరం నిన్ను చేరాలని చేసే ప్రయత్నంలో ఓడిపోతూనే ఉంది. ‘బియాస్’ జలాలు నీ కన్నీటితోనే ప్రవాహమై పొంగుతున్నపుడు నన్ను కనుక్కోలేక నిస్సహాయులై వెతుకుతున్నవాళ్ళు, ఒడ్డున నిల్చొని నా కోసం తపిస్తూ..విలపిస్తూ ఒకర్నొకరు ఓదార్చుకుంటున్న నువ్వూ ,నాన్నా నాక్కనపడుతూనే ఉన్నారు.. ఈ రాకాసి రాళ్ళను, బురద మట్టిని విదిలించుకొని మీ దగ్గరకు పరుగెత్తుకురావాలనుందమ్మా.. ఇప్పటికెన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు గడిచిపోయాయో.. నీళ్ళలో నాకు చలేస్తుందమ్మా! ఎప్పటిలాగే ఓ దుప్పటి కప్పవూ నా స్నేహితుల అమ్మానాన్నలు వెళ్ళిపోయారటగా ఇక మీరూ వెళ్ళిపోతారు మిమ్మల్ని కలవలేకపోయాను... క్షమించండి నన్ను మీదగ్గరకు చేర్చని ఆ దేవున్ని నిందిస్తూ ఈ బురద మట్టినే కప్పుకొని జలసమాదవుతాను...

by Prasad PV



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rbg3Y4

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి