పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, జూన్ 2014, గురువారం

John Hyde Kanumuri కవిత

నా నంబరు మారలేదు ||జాన్ హైడ్ కనుమూరి|| ~*~ నాకు మొబైలిప్పుడు కేవలం సాంకేతిక సమాచార సాధనమే కాదు నా దేహాన్ని, ఆలోచనల్ని వైబ్రేట్‌చేసే పరికరం కూడా. అవసరాలమధ్య అనుసంధానమౌతున్న అనేకనెంబర్లతోపాటు నీ నంబరు అలానేవుంది అప్పుడప్పుడూ ఏదొకటి వెదకుతున్నప్పుడు నీ పేరుతో నంబరు కన్పిస్తుంది అంతటి వెదకులాటలో ఓ జ్ఞాపకం సన్నగా తడుతుంది ఒక్కసారి ప్రయత్నిద్దామని మదిలో తొలుస్తుంది ప్రయత్నించిన వెనువెంటనే కలిసుంటే ఈ పద్యమే లేదు అందుబాటులో లేవనో, పరిథిలో లేవనో పదే పదే పలుకుతుంది దగ్గరవ్వాలనే ఆలోచనకు విభజన రేఖేదో అడ్డమొస్తుందేమో! వాణిజ్య బేరీజులమధ్య నెంబర్లు మారుస్తుంటాము కానీ ఆది నా దగ్గర వుండదు వాడని నెంబర్లను తీసివేస్తుంటాము మరి నా నంబరు నీ దగ్గరుందో లేదో నాకిప్పుడు నీ పిలుపునుంచో, మాటల్లోంచో పొందే తరంగ తాకిడికోసం నీ నుంచి రింగు కావాలి నా నెంబరు మారలేదు సుమా! హఠాత్తుగా జీవితాన్ని ఏమీ మార్చలేదు అయినా అదే ఐడియా 9912159531 *** 19.6.2014 04:37 hours ISD

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1phdimF

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి