తిలక్/రెప్పల కిటికీ __________________________ కిటికీ బయట ఒళ్ళు విరబూసుకుని పడుకున్న చీకటి రాత్రిని ఎక్కువగా తాగినట్టుంది ఒకటే మత్తు వాసన నక్షత్రాలు కూడా తమ శరీరంలో ఖాళీలను నింపలేనంతగా తయారయ్యింది కొండలు చెట్లు ఆకులు పువ్వులు అడవులు చిక్కగా మునిగిపోయాయి చేతులు కాళ్ళ నిండా నల్ల రక్తమే నా కళ్ళు ఎంతసేపు అద్దుకున్నాయో రెప్పల తలుపులు మూసేశాయి రాత్రి ఎప్పటికో ప్రొద్దున్నే నే లేచాక చూసిన తెల్లటి ఉమ్మెత్త పూల నురగ అక్కడంతా/ఇంతలా నిండిన చిక్కదనం మాయమయ్యాక ఇక ఎప్పటికీ నమ్మబుద్దికాలేదు నాకు నాకు తోడుగా ఉంటుందనుకున్న పదార్థమేదో కొత్త రంగేసుకుపోయాక మిగలాలనిపించలేదిక్కడ పచ్చికలన్నీ ఏడ్చి ఏడ్చి తమ శరీరంపై నీళ్ళ బిందువులయ్యాయి ఈ క్షణం/కణాలన్నీ కదలలేక మెదలలేక ఒంటరి యుద్ధంలో పావురాళ్ళై నేలకొరిగాయి ఇక ఎప్పుడూ ఎదురుచూడలేదు మళ్ళా కరిగిపోయే దానికోసం తిలక్ బొమ్మరాజు 19/06/14
by తిలక్ బొమ్మరాజు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/T96jBQ
Posted by Katta
by తిలక్ బొమ్మరాజు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/T96jBQ
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి