పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, మార్చి 2014, సోమవారం

Bhaskar Kondreddy కవిత

kb ||వైరం|| 1 తెలియని దాన్ని గురించి తెలుసుకుందామనుకుంటాను. తెలసుకునే కొద్ది, నెట్టబడుతున్నాను మరింత తెలియనితనంలోకి. 2 ఎక్కడెక్కడ మనం, మనకి కొత్తగా పరిచయమవుతామో, అప్పుడప్పుడల్లాప్రవహిస్తుంటుంది కాస్తంత ప్రేమో, మరికొంత కోపమో, చెప్పలేనంత విషాదమో ఎప్పుడన్నా, ఓ చిన్న సంతోషమో! 3 ఇలాంటి ఓ చోట్లల్లో అలాంటి ఓ సమయాలల్లో సౌకర్యవంతమైన ఓ ప్రణాళిక కావాలి. నీకు బాధుండకూడదు, నాకు కూడదు. పని మాత్రం అలా జరిగిపోవాలి. బుర్రలమీదొట్టు, ఒప్పుకో మరి. ఓ సంధి సయొద్ద రాయబారానికి. ప్చ్, నాకు తెలుసిక, ఘర్షణే అనునిత్యం. 4 మనం నిజంగా ఏ మనిషిని మార్చలేం కనీసం మనల్నికూడా. ఒక్కోక్క దుఃఖవాహిక గుండా పయనిస్తున్నప్పుడెప్పుడన్నా శుభ్రపరచబడతాం, ఓ నాలుగు అశ్రువులచేత. అది కూడా చాలాసార్లు మనకే తెలియనంత సహజంగా. 5 నన్ను నేను ప్రేమగా హత్తుకోవడానికి, నాలోకి నేను ప్రవహించడానికి, బహుశా, ఈ జీవితం అంగీకరించదేమో! ఎదురుచూడాలి, మరోప్రయత్నానికి. (కినిగే పత్రికలో ప్రచురితం)---10/3/2014

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fh8Q5t

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి