పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, మార్చి 2014, సోమవారం

Pusyami Sagar కవిత

!!ప్రస్థానం !! _____ పుష్యమి సాగర్ అక్కడి వీధులన్నీ నే నడచిన అడుగుల శబ్దాన్ని కలుపుకొని కంకర రోడ్డుకింద పదిలంగా జారవిడిచిన గుర్తులను దాచేసుకుంటున్నాయి ..!!!! ప్రతి జ్ఞాపకం ఓ మొలకెత్తి న విత్తనం పువ్వులై నవ్వులై పెదాలపై అప్పుడు అప్పుడు పూస్తూ వుంటుంది ..!!! చిన్ననాటి చెలికాడు తో పంచుకున్న అరుగులు, బామ్మా పెట్టిన మరమరాలు జేబుల్లో పోసుకొని టైరు తో ఆడుకున్న సమయాలు గడియారం లో ముల్లై తిరుగుతూ తిరుగుతూ కళ్ళ లో నిలిచి పోతాయి చిన్నప్పటి పుస్తకాలను తాకినప్పుడల్లా !!!! నా మస్తిష్కం బాల్యం నుంచి కౌమారం లో కి సీతాకోక చిలుక లా ఎగిరొచ్చి హార్మోన్ల సన్నాయి ల కి లయబద్దం గా కొట్టుకొని అందమైన ఉహ దగ్గర అతుక్కుపోతుంది !!!!... ఉదర పోషణ కై ఎక్కని గడప ...దిగని గడప లా పరిగెత్తి పరిగెత్తి అలసిపోయినపుడు భుజం తట్టి ముందుకు నడిపించే ప్రియ స్నేహితులు ఉత్తరాలలో .... ఆత్మీయ పలకరింపులు...!!! ఎంత ఎత్తుకి ఎదిగినా మూలాలను మరువని నా చిట్టి గుండె ప్రస్థానపు గమనాన్ని పరికించి ప్రతి క్షణం కొట్టుకుంటుంది ఆగే వరకు వీడిపోను అని ..!!!! మార్చ్ 10, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gdpDWG

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి